
ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు ఊహించని విధంగా మద్దతు లభిస్తోంది. మమతా మినహా దాదాపు దేశంలోని అన్ని జాతీయ పార్టీలు చంద్రబాబు దీక్షను సమర్ధిస్తున్నాయి. బీజేపీ పార్టీ ఏపీకి చేసిన అన్యాయాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్, శరద్ యాదవ్ తదితరులు దీక్షకు తమ తమ మద్దతు తెలియజేశారు. ఏపీని అభివృద్ధి చేయటంలో చంద్రబాబు దూసుకుపోతున్న తీరును ప్రశంసిస్తూ ఏపీ పట్ల మోడీ తీరును విమర్శిస్తున్నారు.
”ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చింది. విభజన అనంతరం అన్ని రకాల అభివృద్ధిలో సహకారం అందిస్తామని పేర్కొంది. విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. కాబట్టి అప్పుడిచ్చిన ఆ హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తాం” అని మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు.
”ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన అన్ని హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వెంట మేమంతా ఉంటాం. చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోంది. అంతేకాదు ప్రస్తుతం ఆయన పాలనా విధానం చూసిన రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు ఆయన వెంటే ఉన్నారు. న్యాయం కోసం అంతా పోరాడతారు. అవసరమైతే తిరగబడటానికి కూడా వెనుకాడరు” అని ములాయం పేర్కొన్నారు.
”పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ విషయమై ఒక్క మాట్లాడక పోవటం గమనించాలి. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగే సమయం వచ్చేసింది. మోదీ, అమిత్ షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు. తన ప్రసంగాల్లో మోదీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మోదీజీ దేశానికి చేసిందేమీ లేదు. పైగా స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఆయన నిర్వీర్యం చేస్తున్నారు” అని ఓబ్రెయిన్ అన్నారు.
”ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన స్టార్ట్ అవుతుంది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి కేంద్రం చూస్తోంది. దేశం సురక్షితంగా ఉండాలంటే బీజీపీ గద్దె డిలసిందే” అని ఫరూక్ చెప్పారు. అయితే దేశ సహకారం చంద్రబాబుకు లభిస్తుండటంతో బీజేపీ శ్రేణులు కకావికలం అవుతున్నాయి.
Be the first to comment