మ‌హేష్‌బాబు కెరీర్‌ @ 39 … కొన్ని సూప‌ర్‌ సీక్రెట్స్ !

మ‌హేష్ బాబుకు 43 సంవ‌త్స‌రాలా? చాలామంది ఆశ్చ‌ర్య‌పోతారు. ఇప్ప‌టికీ రాబోయే సినిమా మ‌హ‌ర్షి స్టిల్ చూస్తుంటే అత‌ను కాలేజీ కుర్రాడు లాగానే ఉన్నారు. కానీ అత‌నికి 43 నిండాయి. ఈరోజుతో మ‌హేష్‌బాబు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు గురించి కొన్ని అరుదైన విష‌యాలు తెలుసుకుందాం.

* ప్రిన్స్‌గా ఎంట్రీ ఇచ్చి సూపర్‌స్టార్ ఎదిగాడు మహేష్ బాబు. కృష్ణ వారసుడిగా వ‌చ్చిన‌… తండ్రి పేరు చెప్పుకుని ఆయన ముందుకు పోలేదు.
* తెలుగు హీరోల్లో బాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్లు వ‌స్తున్న హీరో!
* దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వ‌చ్చిన ‘నీడ’ చిత్రంలో తొలిసారి మహేష్ బాబు న‌టించారు. అప్పుడు నాలుగేళ్లు.
* ఈ సినిమా వచ్చి 39 ఏళ్లు పూర్తవ‌డంతో మహేష్ బాబు ఫ్యాన్స్ #39YearsForTriumphSSMBInTFI పేరుతో ట్విట్ట‌రులో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
* ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యారు మ‌హేష్‌.
* మురారి న‌ట‌న అత‌నికి ఎక్కువ పేరు తెచ్చిపెట్టింది.
* గుణశేఖర్ దర్శకత్వంలోని ‘ఒక్కడు’ సినిమాతో పెద్ద‌ స్టార్ అయ్యారు.
* యూఎస్ మార్కెట్లో మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించిన 8 చిత్రాలు కలిగిన ఏకైక హీరో మహేష్.
* ‘శ్రీమంతుడు’ సినిమాతో నాన్- బాహుబలి రికార్డుల్లో మొద‌టి స్థానం.
* మహేష్ సినిమాల్లో 4 చిత్రాలు రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించాయి.
* ఏడు నంది అవార్డులు అందుకున్న ఏకైక కాంటెంప‌ర‌రీ హీరో మహేష్.
* ప్రకటనల ద్వారా అత్యధిక పారితోషకం సంపాదిస్తున్న ద‌క్షిణాది న‌టుడు.
* మేడ‌మ్ టుస్సాడ్స్‌లో మ‌హేష్ మైన‌పు విగ్ర‌హం పెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.