
‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది కేరళ భామ సాయిపల్లవి. మిగతా హీరోయిన్లకు భిన్నంగా మాట్లాడడమే కాకుండా, వెరైటీ కథలతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తుంటుంది. ఏ కథ అయినా సాయిపల్లవి చేస్తే సూపర్ డూపర్ హిట్ అవుతుందన్న మాటను సొంతం చేసుకుంది. అలాంటి సాయిపల్లవి పెళ్ళికి రెడీ అయిపోయిందంటున్నారు సినీజనాలు. అది కూడా ఓ రాజకీయనాయకుడి కుమారుడితో అవడం చర్చనీయాంశంగా మారింది.
దక్షిణాదికి చెందిన ఓ మంత్రి కొడుకు సాయిపల్లవిని చూసి మనసు పారేసుకున్నాడట! ఆ మంత్రిగారి కుమారుడు కూడా సినిమా రంగానికి చెందిన వ్యక్తేనట. కాకపోతే అతగాడి ప్రపోజల్‌కు సాయి పల్లవి ‘నో’ అనేయడంతో ఆ హీరోగారు తన తండ్రితో రికమెండ్ చేయించాడట! సాక్షాత్తు మంత్రిగారే వచ్చి పిల్లనివ్వమని అడగడంతో సాయిపల్లవి పేరెంట్స్ కొద్దిగా ఇబ్బంది పడ్డారట! ప్రస్తుతం సాయిపల్లవి రెండు మూడు సినిమాలకు కమిట్ అయి ఉంది. అవి పూర్తయిన తరువాత పెళ్ళి చేద్దామని ఆమె తల్లిదండ్రులు అన్నారట! ప్రస్తుతానికి మంత్రిగారి కొడుక్కి, సాయిపల్లవికి ఎంగేజ్మెంట్ చేసి ఆ తరువాత పెళ్ళి చేయాలని ఇద్దరి పేరెంట్స్ అనుకున్నారట! కాకపోతే ఇది ఎంతవరకూ నిజం అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.
Be the first to comment