సామీ మూవీ రివ్యూ

నటీనటులు : చియాన్ విక్రమ్ , కీర్తి సురేష్ , బాబీ సింహ, ఐశ్వర్య రాజేష్ తదితరులు
ఎడిటింగ్ : వెంకటేష్ అనుగురాజ్
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
నిర్మాత : శిబూ తమిన్స్
దర్శకత్వం : హరి

ఎన్నో సంవత్సరాలుగా హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు చియాన్ విక్రమ్. శంకర్ డైరక్షన్‌లో వచ్చిన ‘అపరిచితుడు’ తర్వాత ఆ తరహా హిట్ లేక సతమతమవుతున్నాడు. తర్వాత ఎన్నో ప్రయోగాలు చేసినా అవన్నీ ప్రతికూల ఫలితాలనే మిగిల్చాయి. దీంతో 2003లో తమిళ్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన ‘సామీ’కి సీక్వెల్‌గా రూపొందిన ‘సామీ స్కేర్’పై బాగా నమ్మకాలు పెట్టుకున్నాడు. హరి దర్శకత్వంలో రూపొందిన సామీ స్క్వేర్‌ను తెలుగులో ‘సామి’ పేరుతో విడుదల చేశారు. మరి ఈ సినిమా అయినా విక్రమ్‌కు హిట్ తెచ్చిపెట్టిందా..?

కథ
సామీ మొదటి భాగంలో జరిగిన కథను వివరిస్తూ ఈ సినిమా ప్రారంభమవుతుంది. పరుశురాం సామీ(విక్రమ్) భువన( ఐశ్వర్య రాజేష్) భార్య భర్తలు. ఆ తరువాత కథ 28 సంవత్సరాలు ముందుకు జరుగుతుంది. ఢిల్లీలో ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకుంటున్న రామసామి (పరుశురాం సామీ కుమారుడు)కు మినిస్టర్ కూతురు దియా (కీర్తి సురేష్) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ఇద్దరు మధ్య ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో రామసామి ఇక కలెక్టర్ అవుదామనుకొని పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఈ లోగా జరిగిన కొన్ని పరిణామాల మధ్య, రామసామి తన తల్లిదండ్రుల గురించి తెలుసుకొని, డ్యూటీ మీద విజయవాడకు వస్తాడు. ఆ తరువాత తన తల్లిదండ్రులను చంపిన వ్యక్తి ఎవరో తెలుసుకుంటాడు. మరి అతడి మీద రామసామి పగ తీర్చుకున్నాడా..? ఇంతకీ రావణ్ భిక్షు ఎవరు..? రామసామీ తల్లిదండ్రులను ఎందుకు చంపారు..? వంటివి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
సింగం సిరీస్‌తో తన సత్తా చాటుకున్న డైరెక్టర్ హరి మళ్లీ మరో సూపర్ హిట్ మూవీ ‘సామి’కి సీక్వెల్‌గా ఈ ‘సామి సీక్వెల్’ను తెరకెక్కించాడు. అయితే ఈ సీక్వెల్‌తో అదే ఒరిజినల్ ఫలితాన్ని రాబట్టే ప్రయత్నంలో విఫలమైయి తీవ్రంగా నిరాశపరిచాడు. పాత కాలపు కథతో, ఆసక్తిలేని కథనంతో, సందర్భం లేకుండా మధ్య మధ్యలో విసిగించే రొటీన్ కామెడీ‌తో రొటీన్‌గా సాగింది ఈ చిత్రం. కానీ చియాన్ విక్రమ్ నట విశ్వరూపం చూడాలనుకునే వారు మాత్రం ఈ సినిమాను చూడొచ్చు. కాకపోతే క్లాస్ ఆడియన్స్‌కు, మరియు విభిన్నమైన చిత్రాలను కోరుకొనే ప్త్రేక్షకులకు ఈ చిత్రం మెప్పించడం కష్టమే.

నటీనటుల పనితీరు
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విక్రమ్ నటన ఈచిత్రానికి హైలైట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ వయసులోకూడా ఆయన తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక దియా పాత్రలో నటించిన కీర్తి సురేష్ తన నటనతో, గ్లామర్‌తో మెప్పించింది. ప్రతినాయకుడి పాత్రలో బాబీ సింహ చెలరేగిపోయాడు. మంచి వేరియేషన్స్‌ను కనబర్చి తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. భువన పాత్రలో ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ మీద కనపడింది తక్కువ సమయమే అయినా తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది.

టెక్నీషియన్ల పనితీరు
సినిమాకు మెయిన్ పిల్లర్ అయినా దర్శకుడు హరి మరో మంచి యాక్షన్ డ్రామాను ప్రేక్షకుల పరిచయం చేద్దామనుకొని పూర్తిగా నిరాశపరిచాడు. కథ లేకుండా రొటీన్ సన్నివేశాలతో హడావిడిగా తీసిన ఈచిత్రం చాల వరకు నిరాశ పరిచింది. ఇక ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ ఎప్పటిలాగా కాకుండా అవుట్ డేట్ సాంగ్స్‌తో సరిపెట్టాడు. ఒక చివరిలో వచ్చే పిల్ల నిన్ను చుస్తే అని సాంగ్ తప్ప మిగితావన్ని తేలిపోయాయి. పాటలతో నిరాశ పరిచిన దేవి నేపథ్యం సంగీతంతో ఆకట్టుకున్నాడు. ప్రియన్ ఛాయాగ్రహణం బాగుంది ప్రతి ఫ్రెమ్ చాల రిచ్‌గా అనిపిస్తుంది. విజయన్, జైల ఎడిటింగ్ కూడా పర్వాలేదు. శిబూ తమీన్స్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

బలాలు
* విక్రమ్ నటన
* కథనం

బలహీనతలు
* రొటీన్ స్టోరీ
* బోరింగ్ సీన్స్
* కామెడీ
* హీరోయిన్ పాత్ర

మొత్తంగా: సామీ నిరాశ పరిచాడు

రేటింగ్: 2/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.