భారీ మల్టీస్టారర్.. డేట్ ఫిక్స్ చేసేశారు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం కొత్త ట్రెండ్ దర్శనమిస్తోంది. కుర్ర హీరోలు చాలా స్పోర్టివ్‌గా ఉంటున్నారు. ఒకరి సినిమా ఫంక్షన్‌లకు ఒకరు వెళ్లడం.. ఒకరి సినిమాను మరొకరు ప్రారంభించడం వంటివి చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా టాలీవుడ్‌లో ఈ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గతంలోలా ఇప్పుడు ఈగోలకు పోయి హీరోలు, వారి అభిమానుల మధ్య గొడవలు కూడా జరగడంలేదు. ఈ పరిస్థితిని ఇలాగే కొనసాగించాలని చాలా మంది సిని పెద్దలు ఆశిస్తుండగా, కొందరు దర్శక, నిర్మాతలు మాత్రం దీన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అలా ప్లాన్ చేస్తున్నవే మల్టీస్టారర్ సినిమాలు. స్నేహపూర్వక పోటీని ఇష్టపడుతున్న నేటి తరంలోని కొందరు స్టార్ హీరోలు మంచి కథలతో వస్తే మల్టీస్టారర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే ఈ మధ్య తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ తరహా చిత్రాలు కొన్ని ప్రారంభమయ్యాయి. మరికొన్ని పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా అంటే ‘ఆర్ఆర్ఆర్’ అనే చెప్పాలి.

జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. దీనికి వర్కింగ్ టైటిల్‌(ఆర్ఆర్ఆర్)ను కూడా ఇది వరకే ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి మరో అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అది కూడా ఓ ప్రత్యేక తేదీన ఈ సినిమా ప్రారంభమవుతోంది. ఈ నెల 11వ నెల, 11వ తేదీ, ఉదయం 11 గంటలకు ఈ సినిమాను అధికారికంగా మొదలుపెట్టబోతున్నారు. ఈ మేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. దీంతో అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అరవింద సమేత తర్వాత ప్రస్తుతం ఎన్టీఆర్ ఖాళీగానే ఉన్నాడు. చరణ్ మాత్రం బోయపాటి సినిమా షూటింగ్‌లో బీజీగా గడుపుతున్నాడు. వారి కాల్షీట్లను బట్టి షూటింగ్ జరపనున్నారని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.