నడిరోడ్డుపై రోజా బూతు పురాణం

వైసీపీలో కీలక నేతగా ఉన్నారు నగరి ఎమ్మెల్యే రోజా. ఆ పార్టీలో జగన్ తర్వాత అంతటి పేరును గడించిన వారిలో ఆమె ఒకరు. ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె.. ప్రభుత్వంపై, ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిరంతంర వార్తల్లో నిలుస్తుంటారు. గత ఎన్నికల్లో నగరిలో టీడీపీ నిలబెట్టిన సీనియర్ నేత(గాలి ముద్దుకృష్ణమ నాయుడు)ను ఓడించి విజయబావుటా ఎగురవేశారు రోజా. స్వతహాగా దుందుడుకు స్వాభావం ఉన్న రోజా.. తరచూ ఏదోక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. గతంలో అసెంబ్లీ సమావేశాల సమయంలో చేసిన రచ్చకు, చాలా రోజులు సమావేశాలకు హాజరు కాకుండా నిషేదం ఎదుర్కొన్నారు. అయినా, ఆమెలో మాత్రం మార్పు రాలేదు. నిషేదం తర్వాత ఆమె రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా రోజా ఈ మధ్య నియోజకవర్గంపైనే ఎక్కువ దృష్టి సారించారు. తరచూ పర్యటనలు చేయడం.. పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం వంటివి చేస్తున్నారు. అంతేకాదు, ఇటీవల 10మంది చిరు వ్యాపారస్తులకు తోపుడు బండ్లు ఇచ్చామని, నగరి ప్రభుత్వాస్పత్రిలో, హాస్టళ్ళలో, బాలికల జూనియర్‌ కాలేజీలో ఆర్‌వో ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశారు.

తాజాగా రోజా మరోసారి వార్తల్లోకెక్కారు. ఈసారి మాత్రం అధికార పార్టీ మీద విమర్శలు చేసో.. ఏదో సహాయ కార్యక్రమాలు చేసో మాత్రం కాదు. నడిరోడ్డుపై పోలీసులను బూతులు తిడితూ ఆమె వివాదంలో చిక్కుకున్నారు. ఆ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తుండడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇటీవల ఆమె నియోజకవర్గంలో ఓ లారీ ప్రమాదం జరిగింది. అందులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీని గురించి రోజా.. ప్రమాదానికి కారణమైన వారిని శిక్షించాలని మహిళ శవంతో రోడ్డుపై నిరసనకు దిగారు. ఆ క్రమంలో ఓ సీఐ లారీ ఓనర్ నుంచి డబ్బులు తీసుకుని వారికి కొమ్ముకాస్తున్నాడని ఆమె ఓ సీఐని రాయడానికి వీలులేని భాషలో బూతులు తిట్టారు. దీనిపై బాగా విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ అభిమానులు, జనసేన అభిమానులు సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తుండడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. వాస్తవానికి రోజా మంచి పని కోసమే నిరసన తెలిపినా.. పోలీసులను పట్టుకుని బూతులు తిట్టడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై వైసీపీ నాయకులుగానీ, రోజాగానీ స్పందించకపోవడం గమనార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.