జనసేనలోకి రోజా..!

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఈ మధ్య మీడియాలో అంతగా కనిపించడంలేదు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆమె ఎందుకు ఉన్నట్లుండి సైలెంట్ అయ్యారు..? వైసీపీ ఫైర్ బ్రాండ్ పార్టీ మారబోతున్నారా..? అనే అనుమానాలు చాలా మందికి వచ్చాయి. అయితే దీనిపై ఎవరికీ క్లారిటీ లేదు కానీ, ఎవరికి వారు వాళ్లకు ఇష్టం వచ్చినట్లు ఊహించుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై సంచలన నటి శ్రీరెడ్డి కామెంట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్టు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ సంచలనానికి తెరలేపిన శ్రీరెడ్డి.. దానిపై పెద్ద పోరాటమే చేశారు. అనుకోని వివాదంతో కొంచెం వెనక్కి తగ్గిన ఆమె ఈ మధ్య సోషల్ మీడియా సాక్షిగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె పోస్టులు పూర్తిగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంటున్నాయి. పవన్‌పై వ్యక్తిగతంగా దారుణమైన కామెంట్స్ పెడుతున్న శ్రీరెడ్డి.. పనిలో పనిగా లోకేష్, జగన్‌ ఫ్యాన్స్‌ను ప్రసన్నం చేసుకోడానికి వారికి అనుకూలంగా పోస్టులు చేస్తోంది.

తాజాగా సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా గురించి ఆమె పెట్టిన పోస్టు రాజకీయంగా సంచలనం రేపింది. ‘‘ఏవండోయ్.. అవును.. రోజా గారు జనసేనలోకి జంప్ అవుతున్నారంటగా..? నిజమేనా..? ఓరి నాగబేబీ బాగానే #పులిహోర’’ అంటూ పోస్టు పెట్టింది. ఈమె చేసిన పోస్టు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. రోజా ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో ఆమె నిజంగానే పార్టీ మారబోతున్నారా..? అనుమానం చాలా మందికి కలిగింది. ఇప్పుడు శ్రీరెడ్డి చేసిన పోస్టుతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది.

శ్రీరెడ్డికి చాలా మంది రాజకీయ నాయకులతో పరిచయాలు ఉండడం.. ఆమె కూడా సినీ పరిశ్రమకు చెందినదే కావడంతో రోజా విషయంలో పెట్టిన పోస్టుపై చర్చలు జరుగుతున్నాయి. రోజా విషయంలో మాత్రం శ్రీరెడ్డి చెప్పినట్లు జరిగే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. జగన్.. ఆమెను కావాలనే పక్కన పెట్టారని అందుకే రోజా అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో రోజా ఎలాంటి అడుగు వేస్తుందో తెలియాలంటే ఆమెనే స్వయంగా స్పందించాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.