రోజా.. మ‌ళ్లీ పంచ్‌ల‌తో ఫైర్‌!

ఎప్పుడు వ‌చ్చామ‌న్న‌ది కాద‌న్నా.. గుండు దిగిందా లేదా అంతే.! క‌త్తికి ఎమోష‌న్స్ ఉండ‌వు.. ఇవ‌న్నీ సినిమా డైలాగులు.. వైసీపీ ఎమ్మెల్యే రోజా సెల్వ‌మ‌ణి కూడా.. అంతే.. కొద్దిరోజులు అజ్ఞాతం.. మ‌రికొద్ది రోజులు.. ఫైరింగ్‌.. ఏదైనా వార్త‌లో ఉండ‌టం ఆమె ప్ర‌త్యేక‌త‌. 2014లో న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి గాలిముద్దుకృష్ణ‌మ‌నాయుడుపై ఆమె గెలిచింది.. ఎన్ని ఓట్ల మెజార్టీ తోనో తెలుసా! కేవ‌లం 858 మాత్ర‌మే. కేవ‌లం 0.54 ఓట్ల శాత‌మే.. కానీ.. వైసీపీ మాత్రం ప‌వ‌ర్‌లోకి రాలేక‌పోయింది. దీనికి తానే కార‌ణ‌మంటూ విమ‌ర్శ‌లూ చ‌విచూడాల్సి వ‌చ్చింది. కానీ.. రోజా అంటే ఫైర్‌బ్రాండ్ అనే పేరు తెచ్చుకునేందుకు చాలా హ‌ద్దులు దాటింద‌నే చెప్పాలి. ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు, త‌న‌యుడు లోకేష్‌బాబుల‌ను ఆడేసుకుంది. లోకేష్‌ను పప్పు అంటూ సంబోధిస్తూ.. శాస‌న‌స‌భ్యురాలిగా ఒక మెట్టు దిగ‌జారింద‌నే పేరు తెచ్చుకుంది. గాలి మ‌ర‌ణంతో.. ఇక న‌గ‌రి 2019లోనూ త‌నే అనే ధీమాలో ఉంది. పైగా.. ఇటీవ‌ల స‌ర్వేలోనూ రోజా ప‌ర్లేదంటూ న‌గ‌రి ప్ర‌జ‌లు చెప్ప‌టంతో.. మాయ‌మైన రోజా మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష‌మైంది. రావ‌ట‌మే మంత్రి లోకేష్‌ను టార్గెట్ చేసుకుంది. ఆయ‌న ప‌ప్పు కాదు.. గ‌న్నేరుపప్పు అంటూ సంచ‌ల‌న కామెంట్స్‌ చేశారు.  అయితే ఇదంతా కేవ‌లం తాను జ‌గ‌న్‌తోనే ఉన్నానంటూ సంకేతాలు ఇచ్చేందుకే నంటూ టీడీపీ శ్రేణులు దుయ్య‌బ‌డుతున్నాయి. రోజా న‌గ‌రి ఎమ్మెల్యేగా కంటే.. జ‌బ‌ర్ద‌స్త్ న్యాయ‌నిర్ణేత‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. మ‌రో జ‌డ్జి నాగేంద్ర‌బాబు.. మెగా ఫ్యామిలీకు చెందిన వాడు కావ‌టంతో.. రోజా.. జన‌సేన‌లోకి జంప్ అంటూ ఊహాగానాలు వినిపించాయి. పైగా ఇటీవ‌ల ఓ విష‌యంలో ప‌వ‌న్‌ను విమ‌ర్శించిన వారిపై రోజా ఒంటికాలిపై లేశారు కూడా. ఇవ‌న్నీ రోజా జ‌న‌సేన కండువా క‌ప్పుకుంటుంద‌నేందుకు బ‌లాన్నిచ్చాయి. దీన‌వ‌ల్ల‌పై వైసీపీ ఆఫీసుకు వెళ్ల‌ట్లేద‌ని.. మీడియా స‌మావేశాల్లో క‌నిపించ‌ట్లేదంటూ గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి. మ‌రి ఇప్పుడు ఏమైందో.. ష‌డ‌న్‌గా మెరిసి.. ఒక్క‌సారిగా వైసీపీ శ్రేణుల‌కూ షాక్ ఇచ్చారామె. మ‌రి దీని వెనుక అర్ధం.. అంత‌రార్ధం ఏమిట‌నేది రోజ‌మ్మ‌కే తెలియాలంటూ.. స్వ‌ప‌క్ష నేత‌లు సెటైర్లు వేస్తున్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.