రేవంత్‌ రెడ్డి వెనుక భారీ కుట్ర..!

కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. రాజకీయ ఆరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే కీలక నేతగా ఎదిగిన రేవంత్.. చంద్రబాబుకు నమ్మిన బంటుగా మారిపోయాడు. విభజనకు ముందు చంద్రబాబు నీడలో ఉన్న ఆయన.. అనంతరం తెలంగాణలో టీడీపీకి పెద్ద దిక్కు అయ్యాడు. అధికార టీఆర్ఎస్‌పై పోరాంటం చేసి టీడీపీలో ఓ వెలుగు వెలిగి, కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. నేరుగా కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ దగ్గరకు వెళ్లి ఆ పార్టీ కండువా కప్పుకున్న రేవంత్.. తనతో పాటు తన అనుచరులను కూడా భారీ సంఖ్యలో తీసుకువెళ్లాడు. పార్టీలో చేరిన కొద్దిరోజులు తన గళాన్ని గట్టిగానే వినిపించిన ఆయనకు.. టీడీపీలో ఉన్నంత స్వాతంత్య్రం ఆయనకు కాంగ్రెస్ పార్టీలో దొరకడంలేదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే ఆ పార్టలో తలలు పండిన చాలా మంది నాయకులు ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ అధిష్టానం కొన్ని నిర్దిష్టమైన అంచనాలతోనే రేవంత్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చే ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. కాసేపు ఇవన్నీ పక్కన పెడితే, ఆయన మౌనం వెనుక ఎన్నో కుట్రలు దాగుని ఉన్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఉన్నంత చురుకుగా కాంగ్రెస్ పార్టీలో వ్యవహరించకపోవడం వెనుక ఓ బలమైన కారణం ఉందనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌లోని ఒక వర్గం రేవంత్‌ను టార్గెట్ చేసిందట. రేవంత్ రెడ్డి చురుకుగా ఉంటే వాళ్ల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావించి, అతడిని కట్టడి చేసే ప్రయత్నాలు చేశారని, హైకమాండ్ దగ్గర కూడా రేవంత్ గురించి చెడుగా చెప్పాలని నిర్ణయించుకున్నారని, ఎక్కడ తమను దాటుకుని వెళ్లిపోతాడోనన్న భయంతో ఆ నేతలు రేవంత్.. ఆయనతో పాటు కాంగ్రెస్‌లో చేరిన కొందరు నేతలను గిట్టనివ్వడంలేదని రేవంత్ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన వెంటనే ఆయన నేరుగా రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేశాడని సమాచారం. ఈ విషయంలో రాహుల్.. రేవంత్‌కు బాసటగా నిలిచాడట. అంతేకాదు, ఈ వ్యవహారం గురించిగానీ, పార్టీలోని పరిస్థితుల గురించిగానీ ఎక్కడా మాట్లాడవద్దని, సరైన సమయం చూసుకుని హైకమాండ్ జోక్యం చేసుకుంటుందని, ‘మీ విషయం నేను చూసుకుంటా’నని రాహుల్ భరోసా ఇచ్చాడని టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.