రేవంత్ రెడ్డి.. అనుకున్నది సాధించాడుగా!

తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి భద్రతకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రేవంత్ కి భద్రత కల్పించాలంటూ ఇప్పటికే ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కేంద్రం చేసిన అప్పీల్ ని హైకోర్టు అంగీకరించింది. రేవంత్‌రెడ్డి భద్రత అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెబుతూ ఈ మేరకు 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ ఈ భద్రతను కొనసాగించాలని సదరు ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది.

తనను అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని, నిరంతరం తన వెంట నలుగురు భద్రతాసిబ్బంది ఉండేలా.. తనకు భద్రత కల్పించాలని రేవంత్‌ రెడ్డి గతంలో హైకోర్టును విన్నవించారు. నిజానిజాలు తెలుసుకొని దీనిపై సుదీర్ఘ వాదనల అనంతరం కేంద్రం భద్రత కల్పించాలని పేర్కొంటూ సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అయినా తనను పట్టించుకోవటం లేదని రేవంత్‌రెడ్డి గురువారం ఆరోపించారు. కేంద్ర భద్రతా సిబ్బందితో తనకు సెక్యూరిటీ ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పినా.. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. స్థానిక నేతల భద్రత అనేది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతనే అని, రేవంత్‌కు కేంద్రం భద్రత కల్పించాలన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సవరించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పును వెలువరించింది. రేవంత్‌రెడ్డికి భద్రతను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ఆదేశించింది. 4 ప్లస్ 4 భద్రతతోపాటుగా ఆయనకు ఎస్కార్ట్‌ ను ఇవ్వాలని పేర్కొంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే వరకు ఆయన ఈ భద్రత కలిపించాలని చెప్పింది హైకోర్టు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.