రేవంత్ అన్నా.. ఇప్పుడేం  చేద్దాం!

రెండికిచెడ్డ రేవంత్‌రెడ్డి అంటే ఇదేనేమో.  ఏదో అనుకుంటే.. ఇంకేదో జ‌రిగింద‌న్న‌ట్లుంద‌ట. నిన్న‌టి వ‌ర‌కూ మందీమార్భ‌లం.. ఎటువెళ్లినా క‌వ‌ర్‌..క‌వ‌రేజ్ చేసేందుకు మీడియా. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో బ్ర‌హ్మ‌రథం. అంతెందుకు.. ఏపీలో జ‌రిగిన టీడీపీ మ‌హానాడుకు వెళితే.. హ‌ర్షాధ్వానాలు.. స్టేజ్ మీద నుంచి దిగేంత వ‌ర‌కూ చ‌ప్ప‌ట్ల మోత‌లు. ఇదంతా గ‌తం.. రేవంత‌న్న టీడీపీలో చ‌విచూసిన ఆద‌రాభిమానాలు. ఓటుకు నోటు కేసుతో రేవంత్‌రెడ్డి ఇమేజ్ త‌గ్గుంద‌నుకున్నారు. కానీ.. టైగ‌ర్ అంటూ బిరుదిచ్చి మ‌రీ తెలంగాణ‌లో స్వాగతం ప‌లికారు. ఇది పెద్ద విష‌యం కాద‌నేంత భ‌రోసానిచ్చారు. గ‌ట్టి పోటీ వేళ కూడా.. రేవంత్ రేప‌టి సీఎం అనే నినాదాన్ని జ‌నంలోకి తీసుకెళ్ల‌గ‌లిగారు. ఇప్పుడు అదంతా క‌ల‌గా మారింది. హ‌స్తం పార్టీలోకి చేర‌గానే.. త‌న‌కు స్వాగ‌త స‌త్కారాలు.. టీడీపీలో ఉన్న గౌర‌వ‌మే ఉంటుంద‌ని భావించాడు. కానీ.. అదంతా ఒట్టిదే అని .. ఎన్‌టీఆర్ భ‌వ‌న్‌లో ఉన్నంత‌టి క్ర‌మ‌శిక్ష‌ణ గాంధీభ‌వ‌న్‌లో క‌నిపించ‌ద‌ని అర్ధం చేసుకునేందుకు ఆరు నెల‌లు ప‌ట్టిన‌ట్టుంది. ఇప్పుడు అక్క‌డ ఇమ‌డ‌లేక‌. బ‌య‌ట‌కు రాలేక‌.. పైగా.. ఏసీబీ కేసుతో కేసీఆర్ ఎక్క‌డ ఉచ్చు బిగిస్తాడ‌నే భ‌యం వెంటాడుతుంద‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కూ చంద్ర‌బాబు ఉన్నాడ‌నే భ‌రోసా రేవంత్ అన్న‌ను న‌డిపించేది.
కానీ.. హ‌స్తంలో ఎవ‌రు ఎవ‌రికి వెన్నంటి ఉంటారో.. ఎవ‌రు ఎలా.. వెన్నుపోటు పొడుస్తారో తెలియ‌టం కూడా క‌ష్ట‌మే అంటున్నారు రేవంత్‌రెడ్డి అభిమానులు. త‌త్వం బోధ‌ప‌డినా.. మార్గం మాత్రం క‌నిపించ‌ట్లేదంటూ గ‌గ్గోలు పెడ‌తున్నార‌ట‌. పోనీ.. ఏదోఒక‌టి చేసి గులాబీ గూటికి చేర‌దామా అంటే.. అభిమానం అడ్డొస్తుంది. బీజేపీ అంటే.. ఉన్న‌వాళ్లే వేరే పార్టీల వైపు ప‌రుగు పెడ‌తున్నారు. ఇటువంటి ప‌రిస్థితుల్లో రేవంత్‌రెడ్డికి మాత్రం ఓ ఆశ ఉంద‌ట‌. అదేమిటంటే.. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ, హ‌స్తం పార్టీలు రెండు దోస్తీ చేస్తే.. తిరిగిన త‌న ప్రాభ‌వం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు. మ‌రి.. దీనిపై క్లారిటీ రావాలంటే.. కొద్దికాలం ఆగాల్సిందే. మ‌రి అంత వ‌ర‌కూ రేవంత్ అన్న‌.. ఎలా స‌ర్దుకుపోత‌డ‌నేది అభిమానుల ఆవేద‌న‌. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.