రేవంత్ రెడ్డి.. బాహ‌ుబ‌లా.. క‌ట్ట‌ప్పా!

పాపం రేవంత్‌రెడ్డి.. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత‌కాలం అన్నీ తానై చ‌క్రం తిప్పాడు. తెలంగాణ‌లోనే కాదు.. ఏపీలోనూ బోలెడు అభిమానుల‌ను సొంతం చేసుకున్నాడు. గ‌తేడాది జ‌రిగిన మ‌హానాడులో పాల్గొనేందుకు విశాఖ‌ప‌ట్ట‌ణం వెళితే.. ఎదురైన స్వాగతానికి రేవంత్‌రెడ్డి ఉబ్బిత‌బ్బిబ‌య్యాడు. మ‌రి అటువంటి నేత‌.. త‌మ పార్టీలోకి వ‌స్తే.. మ‌రో బాహుబ‌లి అంటూ.. కాంగ్రెస్ పార్టీ ఊద‌ర‌గొట్టింది. అంద‌లం ఎక్కించేందుకు.. అనుకున్న‌ది సాధించేందుకు మేమంతా వెన్నంటి ఉంటామ‌నేంత‌గా కొంద‌రు సీనియ‌ర్లు ఊద‌ర‌గొట్టారు. ఫ‌లితంగా.. రేవంత్‌రెడ్డి సైకిల్ దిగి చేయి అందుకున్నాడు. కానీ.. నెల‌లు గ‌డుస్తున్నా.. అక్క‌డ త‌న స్థానం ఏమిట‌నేది ఇప్ప‌టికీ అర్ధం కాని ప‌రిస్థితి. పోనీ సీనియ‌ర్లు ఎవ‌రైనా ప‌లుక‌రించారా అంటే.. అబ్బే అదీ లేదు. మొన్నా మ‌ధ్య మంత్రి ల‌క్ష్మారెడ్డి వైద్య‌డిగ్రీపై కొంత రేవంత్‌రెడ్డి రాద్ధాంతం చేసినా.. మీడియా నుంచి అనుకున్నంత ప్ర‌చారం క‌ర‌ువైంది. ఇక‌పోతే.. దీనిపై ల‌క్ష్మారెడ్డి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చాడు. దేశం పార్టీలో ఉన్న‌పుడు టీడీపీ శ్రేణులు రేవంత్ త‌మ హీరోగానే భావించాయి. అందుకే.. రాష్ట్రంలో ఏ మూల‌న ప‌ర్య‌టించినా ఫ్లెక్సీలు.. స్వాగ‌తాలు అట్ట‌హాసంగా ఉండేవి. ఇప్పుడు.. ఎటు వెళ్లినా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు.. స్పంద‌న నామ‌మాత్ర‌మే. దీంతో బాహుబ‌లిగా చ‌క్రం తిప్పుతాడ‌ని భావించిన రేవంత్ అన్న‌.. క‌ట్ట‌ప్ప‌గా మారాడంటూ.. రేవంత్‌రెడ్డి అభిమానులు కొంద‌రు గుస‌గుస‌లాడుకుంటున్నారు. పోన్లే.. ఎన్నిక‌ల ముందైనా అన్న‌కు మంచి స్థానం ఇవ్వ‌క‌పోతారా! అని ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై రేవంత్‌రెడ్డి మాత్రం మౌన‌మే స‌మాధానం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. పైగా కాంగ్రెస్ ఏ ప‌నిచెబితే అది చేస్తానంటున్నారు.. లోక‌ల్ లీడ‌ర్ల‌తో నాకేం ప‌ని.. ఏది కావాల‌న్నా.. రాహుల్ ఉన్నాడుగా అంటూ ధీమాగా ఉన్నార‌ట‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.