ఊపందుకున్న రిజ‌ర్వేష‌న్ రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఉన్న‌ట్టుండి బీసీల పై అపార ప్రేమ కురిపిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కాపులకు బీసీల్లో 5 శాతం కోటా కల్పించ‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు. మొదటి నుంచి ఇరువురు సీఎంలు అన్ని విష‌యాల్లోనూ  పోటాపోటీగానే ఉంటున్నారు. బీసీల్లో ఎఫ్ కేటగిరీలో చేర్చడం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగలకు బాబు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వెనుకబడిన వర్గాల పరిధిని విస్తరించడం ద్వారా తన ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నది చంద్రబాబు యోచ‌న‌.  తెలంగాణలో  బీసీలందరినీ తమ వైపునకు తిప్పుకోవడం ద్వారాకేసీఆర్  తెలుగుదేశం పార్టీ కి చెక్ పెట్టారు. ఏపీలో బాబు ప్రకటించిన ‘కాపు కోటా’  ప్రతిపాదనను బీసీ జాబితాలోని వివిధ కులాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ వ్యతిరేకతను రూపుమాపకుండా ‘కేటగిరీ’ చేసినంత మాత్రాన కాపులకు ఏమీ జ‌ర‌గ‌క‌పోవ‌చ్చు. మ‌రోవైపు చట్టసభల్లో బీసీలకు కోటా అంశంపై కేసీఆర్ ఎంత వరకూ నిలుస్తార‌నేది వేచిచూడాలి. ఎన్నికలు ఏడాది దూరంలో ఉన్న నేపథ్యంలో ఎవరి దారిలోవారు బీసీల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 

అయితే వీరి ‘రాజకీయాలు’ ఎలా ఉన్నా కూడా వెనుకబడిన వ‌ర్గాల వారికి ‘రిజర్వేషన్’ కల్పించాల‌ను కోవ‌డం హ‌ర్షించ‌ద‌గిన‌ పరిణామం. దేశంలో వెనుకబడిన‌వారు వివక్షకు గురికాకుండా సమ‌సమాజ సృష్టికి బాటలు వేయాలనే ఉద్దేశంతోనే భారత రాజ్యాంగంలో ఈ ప్రత్యేక సౌకర్యాలను పొందుపరిచారు. అయితే ఈ రోజుకీ ఇంకా ఆ వెనుకబాటు త‌నం అలాగే ఉందంటే చిత్తుశుద్ధిలేని రాజ‌కీయ నాయ‌కులే అందుకు కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.