
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్.. మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్న ఆమె.. తాజాగా మరో పర్సనల్ విషయాన్ని బయటపెట్టారు. సోషల్ మీడియాలో లైవ్లోకొచ్చిన రేణూ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అది కూడా పవన్ కల్యాణ్ గురించి కావడంతో నెట్టింట్లో ఇది హల్చల్ చేస్తోంది. పవన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత రేణూ దేశాయ్.. ఇన్ని రోజులు ఒంటరిగా ఉన్నారు. తనకు తోడు కావాలని గతంలో చెప్పిన రేణూ దేశాయ్.. ఇటీవల ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇన్స్టాగ్రామ్ ద్వారా లైవ్‌లోకి వచ్చిన రేణూ దేశాయ్‌ని ఓ అభిమాని ‘‘మీరు పెళ్లి చేసుకుంటున్నారు కదా. తర్వాత కూడా పవన్‌తో టచ్‌లో ఉంటారా..?’’ అని ప్రశ్నించాడు. దీనికి ఆమె తడుముకోకుండా సమాధానం చెప్పారు. ‘‘తప్పకుండా పెళ్లైన తర్వాత కూడా నేను పవన్‌కల్యాణ్ గారితో టచ్‌లోనే ఉంటాను. ఎందుకంటే నాకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న నా ఇద్దరి పిల్లలకు అతను తండ్రి. సెలవులు, ఇతర వేడుకల సందర్భంగా నా పిల్లలను తండ్రి దగ్గరకు పంపిస్తుండాలి. పిల్లల భవిష్యత్తు గురించి పవన్‌తో చర్చిస్తుండాలి. అందుకే ఆయనతో టచ్‌లో ఉండక తప్పదు’’ అని రేణూ తన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
Be the first to comment