విడాకులకు ముందే పవన్ వేరే యువతితో బిడ్డను కన్నారు: రేణూ

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సంచలన విషయాలను బయటపెట్టారు. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ఆమె.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పవన్‌తో విడాకులు తీసుకుని చాలా కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క విషయాన్ని కూడా వెల్లడించని రేణూ.. ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాలను వెల్లడించారు. దీంతో ఈ వీడియో వైరల్ అయిపోయింది. ఆమె బయటపెట్టిన విషయాలు అటు సినీ రంగంలోనూ.. ఇటు రాజకీయ రంగంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఇంటర్య్యూలో అసలు విడాకులు తీసుకోడానికి కారణమేంటి..? ఎవరు ముందు విడాకుల ప్రస్థావన తీసుకువచ్చారు..? ఇప్పుడు ఈ విషయాలు బయటపెట్టడానికి కారణమేంటి..? వంటి తదితర వ్యక్తిగత విషయాలను ఆమె అభిమానులతో పంచుకున్నారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్న రేణూ దేశాయ్.. ఇటీవల ఓ ప్రముఖ న్యూస్ చానెల్‌లో పని చేసే రిపోర్టర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో చాలా వ్యక్తిగత విషయాలు వెల్లడించిన ఆమె పవన్‌తో విడాకులకు గల కారణాలను కూడా చెప్పారు. ‘‘మొదట విడాకులు అడిగింది పవన్ కల్యాణ్ గారే. ఆయన అడగ్గానే నాకు కోపం వచ్చేసింది. అప్పుడు ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఆ కోపంలోనే విడాకులకు అంగీకరించాను. కాకపోతే ఆయన రాజకీయాల్లో ఉండడం వల్ల ఇదంతా బయట పెట్టకూడదనే ఇన్నాళ్లూ ఏమీ బయటపెట్టలేదు. నాకు కాబోయే అత్తామామలకు విడాకుల కారణాలు చెబితే ‘నీ త‌ప్పేం లేన‌పుడు ఇలా ఎందుకు అన్ని మాట‌లు భ‌రిస్తూ సైలెంట్‌గా ఉన్నావు’ అంటూ ప్రశ్నించారు. అందుకే ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది’’ అని రేణూ వివరించింది.

అంతేకాకుండా కొంత మంది పవన్ ఫ్యాన్స్ తనను టార్చర్ పెడుతున్నారని, అందులో ఆడవారు కూడా ఉండడం దురదృష్టకరమని ఆమె అన్నారు. ‘‘వాళ్లకేం తెలుసు నా బాధ. తన భర్త వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకుని, ఓ బిడ్డను కంటే తెలుస్తుంది. ఇలాంటి వాళ్లందరికీ ఏం చెప్పాలి..? నా భర్త.. నాతో కాపురం చేస్తూనే వేరే అమ్మాయితో అఫైర్ పెట్టుకున్నాడని చెప్పనా..? ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేశాడని చెప్పనా..? ఇప్పుడు పవన్ రాజకీయాల్లో ఉన్నారని చెప్పడంలేదు.. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. నా వెనుక ఏ రాజకీయ నాయకుడూ లేడు. ఏ రాజకీయ పార్టీ లేదు. నా భవిష్యత్ కోసం ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది’’ అంటూ విడాకులకు అసలు కారణం బయటపెట్టింది.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.