కొందరు చంపేస్తామని బెదిరించారు: రేణూ దేశాయ్

కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్. అయితే ఇటీవల పవన్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ కారణంగా ఆమె ట్విట్టర్‌కు గుడ్‌బై కూడా చెప్పేశారు. ఏదైనా విశేషం ఉంటే కేవలం ఇన్‌స్టాగ్రామ్ నుంచే అభిమానులతో పంచుకుంటున్నారు. పవన్‌తో విడాకుల తర్వాత పిల్లలతో కలిసి పుణేలో ఉంటున్న రేణూ.. రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న రేణూకు.. అసలు రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చింది..? తనకు కాబోయే భర్త తాలూకు వివరాలేంటి..? తదితర విషయాలు వివరించడానికి ఆమె ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని తన వ్యక్తిగత విషయాలను ఆమె బయటపెట్టారు.

‘‘నా పిల్లల భవిష్యత్తు గురించి గత సంవత్సరం నేను మళ్లీ పెళ్లి చేసుకోవడంపై ఆలోచన మొదలు పెట్టాను. ఈ విషయాన్ని ఫ్యాన్స్‌కు చెప్పగానే వారి నుంచి చాలా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. ‘నువ్వు పెళ్లి చేసుకుంటే చంపేస్తాం’.. ‘నిన్ను, నీ కాబోయే భర్తను కూడా చంపేస్తాం’ అంటూ సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని నా సన్నిహితుల వద్ద ప్రస్తావించగా సోషల్ మీడియాలోని కామెంట్స్‌ను పట్టించుకోవలసిన అవసరం లేదని చెప్పారు. కానీ అలా పట్టించుకోకుండా నేను ఉండలేకపోయాను. నాకు కాబోయే భర్తకు హాని కలగకూడదనే ఆయన ఎవరనేది నేను చెప్పలేదు. నేను ప్రేమ పెళ్లి మాత్రం చేసుకోవడంలేదు. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లే. మాకు వివాహం అయిన తరువాత ఆయన ఎవరనేది చెబుతాను’’ అని రేణు వెల్లడించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.