గులాబీ గుండెల్లో రెబెల్స్ మోత‌!

కేసీఆర్ ది ఆత్మవిశ్వాస‌మా. అతి విశ్వాస‌మా.. ఏమో.. ఇప్పుడెలా తెలుస్తుంది. నిజ‌మే.. కానీ.. స‌ర్కారు ర‌ద్ద‌యిన త‌రువాత ప‌రిణామాలు చూస్తే మాత్రం కేసీఆర్ స్వీయ‌త‌ప్పిద‌మే అనే అనుమానం వ‌స్తోంది. పైగా ధీమా త‌న అంగ‌బ‌లం.. అర్ధ‌బ‌లం.. రాశిఫ‌లంపై పెట్టుకున్న న‌మ్మ‌కం కాస్త తుస్ మ‌నే అవ‌కాశాలు క‌ళ్లెదుట క‌నిపిస్తున్నాయి. కేసీఆర్‌ను ఒక్క‌మాట తూల‌నాడేందుకు కూడా ధైర్యంచేయ‌ని నేత‌లు ఇప్పుడు రోడ్డెక్కి మ‌రీ స‌వాల్ విసురుతున్నారు. తాజా ఎమ్మెల్యేలకు సీటిచ్చినా.. ఆ ఆనందం ఇట్టే నిల‌వ‌ట్టేదు. రేప‌టిరోజున పొత్తులు ఖ‌రారై.. బ‌ల‌మైన అభ్య‌ర్థి ఎదురైతే చేతులెత్తేసే ప‌రిస్థితులు కూడా కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్నాయి. పైగా కేటీఆర్‌పై చాలామంది సీనియ‌ర్లుగుర్రుగా ఉన్నారు. కేసీఆర్‌ను గెలిపించినా.. సీఎం అవుతారా అనే అప‌న‌మ్మ‌కం కూడా మొద‌లైంది. తాను కేంద్రంలో ఉండి.. కొడుకును రాష్ట్ర సార‌థిగా చేయాల‌నే ఆలోచ‌న కూడా ప‌లు సంద‌ర్భాల్లో కేసీఆర్ ప‌రోక్షంగా చెబుతూ రావ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత కేసీఆర్ నాయ‌క‌త్వంపై పార్టీయే కాదు.. సామాన్యులు కూడా భారీ అంచ‌నాలు పెంచుకున్నారు. ఇన్నేళ్ల ప‌రాయి పంచ‌న చ‌విచూసిన అనుభ‌వాలు దూర‌మ‌వుతాయ‌ని భావించారు. కానీ.. కేసీఆర్ తీరు మాత్రం.. 2019పైనే ఉంచారు. ఎక్క‌డ‌కు వెళ్లినా గుప్పించిన హామీలు ఒక్క‌టీ నెర‌వేర్చ‌లేదు. డ‌బుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు, ద‌ళితుల‌కు 3 ఎక‌రాల భూమి, ల‌క్ష ఉద్యోగాలు ఇవ‌న్నీ ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉన్నాయి.
క‌నీసం ఉస్మానియూ యూనివ‌ర్సిటీ, స‌చివాల‌యం గ‌డ‌ప తొక్క‌లేదంటే.. కేసీఆర్ తీరు అర్ధ‌మ‌వుతుంద‌నే విమ‌ర్శ‌ల‌ను కొనితెచ్చుకున్నారు. మాట‌ల‌తో మ‌భ్య పెట్ట‌గ‌ల కేసీఆర్ 2019లోనూ ఈజీగా త‌మ‌ను గెలిపిస్తాడ‌ని ఆశ‌లు పెట్టుకున్న‌నేత‌ల్లోనూ ఇప్పుడిపుడే ఆందోళ‌న మొద‌లైంది. ఓ వైపు కోదండ‌రాం, మ‌రోవైపు విద్యార్థులు, నిరుద్యోగులు.. మూడో వైపు.. టీడీపీ, కాంగ్రెస్ క‌ల‌యిక‌తో మ‌హాకూట‌మి.. వెర‌సి.. అన్ని వైపుల నుంచి ప్ర‌త్య‌ర్థులు గ‌ట్టిప‌ట్టు బిగిస్తున్నారు. గులాబీ జెండా వెలిగిపోతుంద‌నేది ప‌క్క‌న‌బెడితే.. ప‌ల్లెల్లోనూ గులాబీప‌ట్టు స‌డ‌లుతుంది. టీడీపీ, హ‌స్తం క‌ల‌యిక‌తో.. గులాబీబాస్ కూడా కాస్త సందిగ్థంలో ప‌డ్డార‌ట‌. పైగా.. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ రెబెల్స్ మోత మోగిస్తున్నారు. త‌మ‌కు అనుకూల‌మైన వారికి సీటివ్వ‌లేద‌నే అక్క‌సుతో.. ఏకంగా కేసీఆర్ బొమ్మ‌ల‌నే త‌గుల‌బెట్టేంత వ‌ర‌కూచేరారు. ఇన్ని గండాల‌ను ఎదుర్కొని కేసీఆర్ గ‌ట్టెక్క‌ట‌మంటే.. నిజంగా రికార్డే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.