విపక్షాల ఓటమికి కారణం ఆయనేనట..!

దేశ వ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించింది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక. ఏకగ్రీవంగా జరగాల్సిన ఎన్నికను అధికార, ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓటింగ్ వరకు తీసుకు వచ్చాయి. ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్థి, జనతాదళ్‌(యూ) ఎంపీ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌ 125 ఓట్లు తెచ్చుకుని విజయం సాధించారు. విపక్షాలు తరపున పోటీ చేసిన కాంగ్రెస్ ఎంపీ బీకే హరిప్రసాద్‌కు 105 ఓట్లు మాత్రమే వచ్చాయి. అప్పటి వరకు తటస్థంగా బీజేడీ, అన్నా డీఎంకే, టీఆర్‌ఎస్‌ ఎన్టీయేకు ఓటు వేయడం వల్ల ఈ కూటమికి దాదాపు 30 పెరిగాయి. అలాగే ఓటింగ్‌కు వైసీపీ, పీడీపీ, ఆప్‌ పూర్తిగా దూరంగా ఉండడం, కొందరు గైర్హాజరవడంతో కాంగ్రెస్‌కు ఓట్లు తగ్గిపోయాయి. మొత్తంగా చూసుకుంటే ఈ ఓటమికి ప్రధాన కారణం రాహుల్ గాంధీయేననే టాక్ వినిపిస్తోంది. రాహుల్‌ మౌనం తమను ఓటింగును బహిష్కరించేట్లు చేసిందని ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ స్వయంగా ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ కారణంగానే రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.

వాస్తవానికి రాజ్యసభలో మిత్ర పక్షాలకు ఛాన్స్ ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే ప్రచారం జరుగుతోంది. అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్‌తో గతంలో వైరం కారణంగా అప్పటి వరకు తటస్థంగా ఉన్న కొన్ని పార్టీలు ఎన్టీయేకు వ్యతిరేకంగా ఓటు వేయాలని డిసైడ్ అయిపోయాయి. కాకపోతే రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయం వల్ల ఆయా పార్టీలు ఎన్డీయేకు ఓటు వేయకతప్పలేదని తెలుస్తోంది. దీనితో పాటు కొన్ని పార్టీలు గైర్హాజరవడానికి కూడా ఇదే కారణమని ఆయా పార్టీలకు చెందిన ఎంపీలు చెబుతున్నారు. ఆప్‌, బీజేడీ, టీఆర్‌ఎస్‌ రాహుల్‌గాంధీ ఫోన్‌ చేస్తే చాలు రాజీపడి కాంగ్రెస్‌ను గెలిపించడానికి సిద్ధపడ్డాయి. ఫోన్‌ చేయడానికి కూడా ఆయన ప్రయత్నించలేదట. అలాగే, ఇటీవల బీజేపీ బాధిత పార్టీగా ఉన్న పీడీపీ కూడా ఓటింగ్ దూరంగా ఉంది. కశ్మీరు మాజీ సీఎం, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ బీజేపీ మీద కోపంతో కాంగ్రెస్‌కు ఓటేయాలని భావించారని, అయితే, కాంగ్రెస్‌ ఆమెను సంప్రదించనే లేదనే ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రాహుల్ అనాలోచిత నిర్ణయం వల్ల ఎన్డీయేకు విజయం దక్కినట్లైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.