క‌డ‌ప ఉక్కు ర‌హ‌స్యం తెలుసా?

చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితంలో సానుకూల ప‌రిస్థితుల కంటే ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎక్కువ‌. కానీ అన్ని ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను అనుకూలంగా మార్చుకోవ‌డం అత‌ని విద్యార్థి ద‌శ నుంచే వెన్నతో పెట్టిన విద్య‌. అన్నింటా రాటుదేలిన చంద్ర‌బాబు వ్యూహాలు ఇత‌రులు గ్ర‌హించేలోపు చంద్ర‌బాబు స‌గం దూరం వెళ్లిపోయి ఉంటాడు. తాజాగా జ‌రిగిన ఒక విష‌యాన్ని మ‌నం ఇక్క‌డ ప్ర‌స్తావించుకోవాలి. ఆ సంఘ‌ట‌న విశ్లేషించుకుంటే చంద్ర‌బాబు ఈ స్థాయికి ఎలా ఎదిగాడు అన్న విష‌యాన్ని కొద్ది వ‌ర‌కు అర్థం చేసుకోవ‌చ్చు.

చాలా కాలంగా క‌డ‌పలో ఉక్కు ప‌రిశ్ర‌మ ప్ర‌తిపాద‌న అలాగే ఉండిపోయింది. మోడీ ప్ర‌భుత్వానికి ఏపీ ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు ప‌లికినా రాష్ట్రాన్ని కొంత‌వ‌ర‌కు వాడుకుని ఆ అవ‌స‌రం తీరాక గాలికొదిలేశారు మోడీ. ఆ క్ర‌మంలో ఉక్కు ప‌రిశ్ర‌మ కూడా పెండింగ్‌లో ప‌డిపోయింది. దీనిపై తెలుగుదేశం ప్ర‌భుత్వం ఏడాదిగా కేంద్ర‌ ప్ర‌భుత్వాన్ని అడుగుతోంది. చివ‌ర‌కు కొంత‌కాలం క్రితం టీడీపీ నేత‌లు దానిపై నిరాహార దీక్ష‌కు కూడా దిగారు. అయినా తెలుగుదేశానికి క్రెడిట్ వ‌స్తుంద‌ని మోడీ స్పందించ‌లేదు. ఆ రోజే క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మకు చంద్ర‌బాబు కొత్త ప్ర‌ణాళిక ర‌చించారు. ఇటీవ‌ల అక్క‌డ జ‌రిగిన ధ‌ర్మ పోరాట స‌భ‌లో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. క‌డ‌ప ఉక్కుక‌ర్మాగారాన్ని కేంద్రం ఇప్ప‌టికైనా ప‌ట్టించుకోక‌పోతే రాష్ట్ర ప్ర‌భుత్వమే నిర్మిస్తుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అంతేకాదు, చివ‌ర‌కు నిన్నటి కేబినెట్ మీటింగ్‌లో చెప్పిన‌ట్లుగానే వ‌చ్చే నెల‌లో ప‌రిశ్ర‌మ ప్రారంభించాల‌ని మంత్రి మండ‌లి నిర్ణ‌యం తీసుకుంది. ఇది సంచ‌ల‌నం. అయితే, కొంద‌రు నేత‌లు ఇది రాష్ట్ర ప్ర‌భుత్వం మీద భారం వేయ‌డ‌మే అని ఆరోప‌ణ‌లు కూడా చేశారు. కానీ బాబు వ్యూహం వారికి అర్థం కాలేదు. అర్థ‌మై ఉంటే వారు ఆ విమ‌ర్శ‌ల‌కు దూరంగా ఉండేవారు.
ఇక్క‌డే బాబు దూర‌దృష్టి ఉంది. గ‌త వారంలో మోడీ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో ఇత‌ర పార్టీల‌ను క‌లిపి మ‌హాకూట‌మికి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. మోడీకి దేశం మొత్తం ఎదురుగాలి వీస్తున్న నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ బ‌లం బాగా పెరిగింది. దానికి తోడు అన్ని బ‌లమైన జాతీయ పార్టీల‌ను చంద్ర‌బాబు కాంగ్రెస్‌కు జ‌త చేశారు. అంటే… వ‌చ్చే ఏడాది లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం ఖాయం. కాబ‌ట్టి ఇపుడు క‌నుక క‌డ‌ప‌లో ఉక్కు ప‌రిశ్ర‌మకు తెలుగుదేశం ప్ర‌భుత్వం శంకుస్థాప‌న చేసి ప‌నులు మొద‌లుపెడితే మ‌రో ఏడెనిమిది నెల‌ల్లో కేంద్రంలో ఏర్ప‌డ‌బోయే మ‌హాకూట‌మి ప్ర‌భుత్వంలో ఎలాగూ చంద్ర‌బాబు మాట చెల్లుతుంది. అపుడు కేంద్రం ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను టేక‌ప్ చేసి శ‌ర‌వేగంగా ప‌నులు పూర్తి చేస్తుంది. దీంతో క‌డ‌ప జిల్లా చరిత్ర‌లో చంద్ర‌బాబు, తెలుగుదేశం చిర‌స్థాయిగా నిలిచిపోతుంది. క్ర‌మంగా వైసీపీ క‌డ‌ప జిల్లాలో ప‌ట్టుకోల్పోతుంది. బ‌హుశా 2024 నాటికి ఉక్కు పరిశ్ర‌మతో పాటు మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌లు చంద్ర‌బాబు క‌డ‌ప‌కు తెస్తారు. అదే వ్యూహంలో భాగంగా క‌డ‌ప‌లోని ప్ర‌తి ఎక‌రానికి నీళ్లిస్తారు. త‌ద్వారా ఇక శాశ్వ‌తంగా క‌డ‌ప జిల్లాపై జ‌గ‌న్ ప‌ట్టుకోల్పోతారు. ఇదీ చంద్ర‌బాబు టార్గెట్ క‌డ‌ప ఆప‌రేష‌న్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.