గణేష్.. పవన్‌కు ఝలక్ ఇవ్వడానికి కారణమిదేనట

రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యాడు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్. శుక్రవారం ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం చర్చనీయాంశం అయింది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో అతనికి ఉన్న సత్సంబంధాలే దీనికి కారణం. పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానమని పదే పదే చెప్పుకునే ఆయన.. గతంలో పవన్ సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన గణేష్.. ఆ మధ్య పవన్‌తో రెండు సినిమాలను కూడా నిర్మించాడు. అంతేకాదు, పవన్‌తో ఎంతో సన్నిహితంగా మెలిగే గణేష్ జనసేనలో చేరకుండా కాంగ్రెస్ గూటికి చేరిపోవడంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. అసలు బండ్ల గణేష్ జనసేనలో చేరకుండా కాంగ్రెస్ కండువా కప్పుకోడానికి కారణమేంటి..? పవన్‌కు, గణేష్‌కు మధ్య చెడిందా..? ఒకవేళ చెడితే దీనికి కారణమేంటి..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల హడావిడి నెలకొన్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో జరిగిన పరాభావానికి బదులు తీర్చుకోవాలని భావిస్తున్న ఆ పార్టీ.. టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ ప్రయత్నాల్లోనే ఉంటూనే ఇప్పటికే ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలతో టీకాంగ్రెస్ నేతలు మంతనాలు కూడా జరిపినట్లు తెలుస్తోంది. వీరితో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా తమ పార్టీలో చేర్చుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌ను పార్టీలోకి ఆహ్వానించారు అక్కడి నేతలు. మొదటి నుంచీ కాంగ్రెస్ అంటే ఇష్టమున్న గణేష్ రాహుల్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఆ సమయంలో పవన్ తనకు తండ్రి లాంటి వాడని, కానీ కాంగ్రెస్ అంటే మొదటి నుంచీ ఇష్టమని చెప్పాడు.

వాస్తవానికి మెగా ఫ్యామిలీ అంటే పడి చచ్చే బండ్ల గణేష్.. పవన్ తరపున వాకాల్తా పుచ్చుకుని మరీ మాట్లాడుతుంటాడు. గతంలో కొద్దిరోజుల కిందట ఓ చానెల్‌లో వచ్చిన డిబెట్‌లో పవన్‌ను విమర్శించిందని వైసీపీ ఎమ్మెల్యే రోజాపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే, తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని భావిస్తున్న పవన్‌ను బండ్ల గణేష్ కలిసి.. రాష్ట్ర బాధ్యతలు తనకు అప్పగించమని అడిగాడట. దీనికి జనసేనాని నో చెప్పడంతో అప్పటి నుంచి పవన్‌కు దూరంగా ఉంటూ వస్తున్నాడని తెలుస్తోంది. ఇక అప్పటి నుంచి పవన్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడని సమాచారం. ఇందులో భాగంగానే పవన్‌కు ఇష్టంలేని కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉండడం.. కొద్దిరోజుల కిందట పవన్ వ్యతిరేకించిన సీఎం రమేష్ ఉక్కు దీక్షకు మద్దతు పలకడం.. చంద్రబాబుకు మద్దతుగా ట్వీట్లు చేయడం వంటివి చేశాడని ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.