రాయ‌పాటి అలా.. జేసీ ఇలా!

ఆ ఇద్ద‌రూ కాంగ్రెస్ నుంచి వ‌చ్చి అడ్డ‌దారిలో ఎంపీలయ్యారు. టీడీపీపై ఒక‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పించిన వారిద్ద‌రూ న‌ర్స‌రావుపేట‌, అనంత‌పురం పార్ల‌మెంట్ స‌భ్యుల రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, జేసీ దివాక‌ర్‌రెడ్డి. సైకిల్ ఎక్కిన త‌రువాత కూడా ఇద్ద‌రూ ప‌లు సంద‌ర్భాల్లో అధినేత చంద్ర‌బాబునాయుడుపై కాస్తో.. కూస్తో విమ‌ర్శ‌లు చేసిన‌వారే. పైగా.. ప్ర‌భుత్వ‌ ప‌నితీరుపై ప‌రోక్షంగా విసుర్లు విసిరిన సంద‌ర్భాలున్నాయి.  ఇద్ద‌రికీ ఇప్పుడు వార‌సుల‌ను రాజ‌కీయాల్లో నిల‌దొక్కుకునేలా చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ప‌వ‌న్‌కుమార్‌రెడ్డి ఇప్ప‌టికే అనంత‌పురం రాజ‌కీయాల్లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఓ వైపు వైసీపీతోనూ ట‌చ్‌లో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రాయ‌పాటి రంగారావును కూడా ఎమ్మెల్యేగా చూడాలుందంటూ ఈ మ‌ధ్య‌నే సాంబ‌శివ‌రావు మ‌న‌సులో మాట వెలిబుచ్చాడు. పైగా ఆ బాధ్య‌త కూడా చంద్రబాబుపైనే అంటూ ఝ‌ల‌క్ ఇచ్చారు. వాస్త‌వానికి రాయ‌పాటి కాంగ్రెస్‌కు న‌మ్మిన‌బంటు. గుంటూరు జిల్లాలో హ‌స్తానికి క‌మ్మ‌వ‌ర్గం నుంచి అండ‌దండ అని కూడా చెప్పాలి. గాక‌పోతే. క‌న్నా వ‌ర్సెస్ రాయ‌పాటి అన్న‌ట్టుగా ఉండేవారు. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఇక‌ కాంగ్రెస్ మూల‌కే అని ముందే మేల్కోన్న‌నేతల్లో రాయ‌పాటి, జేసీ ఇద్దరున్నారు. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు కూడా ఇద్ద‌రు వ‌ర్గాల వారీగా కీల‌క నేత‌లుగా సైకిల్ ఎక్కించుకున్నారు. ఆ త‌రువాత రాయ‌పాటి క‌మ్మ వ‌ర్గానికి బాబు ప్ర‌యార్టీ ఇవ్వ‌ట్లేదంటూ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. దీనివెనుక‌.. బాబు త‌న‌కు టీటీడీ ఛైర్మ‌న్ గిరి ఇవ్వ‌లేద‌నే అక్క‌సు ఉంద‌నేది అంద‌రికీ తెలిసిందే.
అనంత‌రం పోల‌వ‌రం ప్రాజెక్టు కాంట్రాక్టులు దాదాపు ఆయ‌న‌వ‌ర్గానికే ఇచ్చి బాబు స‌ర్దిచెప్పారు. జేసీ కూడా.. మొన్న అవిశ్వాస తీర్మానం స‌మ‌యంలో డిల్లీ వెళ్ల‌నంటూ మొండిప‌ట్టు ప‌ట్టి.. కోట్లాదిరూపాయ‌ల నిధులు మంజూరు చేయించుకున్నాడు. ఇప్పుడేమో ఏకంగా టీడీపీపై ప్ర‌జ‌ల్లో మంచి అభిప్రాయం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. పైగా బీజేపీ కేంద్రంలో ఉన్నంతకాలం ఏపీకు ప్ర‌త్యేక‌హోదా రాదంటూ త‌ర‌చూ టీడీపీను ఇబ్బందికి గురిచేస్తున్నాడు. పైగా అనంత‌పురం ఎంపీగా ఈద‌ఫా త‌న‌ కుమారుడికి సీటు ఇవ్వాల‌నే నిబంధ‌న కూడా చేసిన‌ట్టు స‌మాచారం. ఇదే ఎంపీ సీటు కోసం ప‌రిటాల వార‌సుడు శ్రీరామ్ కూడా గంపెడాశ‌లు పెట్టుకున్నారు. ప‌రిటాల ర‌వి కుటుంబం ప‌ట్ల సీమ‌లో ఉన్న సానుకూల‌త‌తో ఈజీగా గెల‌వ‌గ‌ల‌మ‌నే న‌మ్మ‌కం కూడా వారిలో ఉంది. ఇన్ని అంచ‌నాలు.. లెక్క‌లు క‌డుతున్న స‌మ‌యంలో ఈ ఇద్ద‌రూ.. 2019 ఎన్నిక‌ల నాటికి వీరిద్ద‌రూ పసుపుద‌ళంలో ఉంటారా… ప‌క్క‌పార్టీకు మార‌తారా అనేది కూడా పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.