రాయలసీమలో 52 సీట్ల కి –టీడీపీ 43, వైసీపీ 9 —–జేసీ అంచనా!

రాయలసీమలో = 52 టీడీపీ 43, వైసీపీ 9 జేసీ అంచనా! ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీమలో మొత్తం 52 సీట్లలో టీడీపీ 43 అసెంబ్లీ సీట్లు గెలుస్తుందని కుండబద్దలు కొట్టారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా..టిడిపికి తాను చెప్పిన దానికంటే ఒకటి రెండు ఎక్కువే వస్తాయని దివాకర్‌రెడ్డి బల్లగుద్ది చెపుతున్నారు. రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలోనే వైకాపా బలహీనపడిందని…ఇక్కడ పరిస్థితితో పోల్చుకుంటే…ఆంధ్రాలో టిడిపి స్వీప్‌ చేస్తుందని ఆయన అన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు ఇచ్చిన ‘టిడిపి’ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, కొంత మంది కులమేదేతై తమకెందుకు..తమ కష్టాలు తీర్చిన ‘చంద్రబాబు’కే ఓటు వేస్తామని చెబుతున్నారని…దీనిలో తమ సామాజికవర్గం వారు కూడా ఉన్నారని ఆయన చెబుతున్నారు. మొత్తం 52 సీట్లు ఉన్న ‘రాయలసీమ’లో టిడిపికి 43 సీట్లు గెలిస్తే..వైకాపాకు దక్కేది కేవలం 9 సీట్లు మాత్రమే…! ఒకవైపు ‘జగన్‌’ అష్టకష్టాలు, ఆయాసపడుతూ పాదయాత్ర చేస్తున్నా ఆ పార్టీ పుంజుకోకపోవడంపై పార్టీకి చెందిన సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులు జాలి పడుతున్నారు.

ఎంత సేపూ ఎప్పుడో పోయిన తండ్రి గురించి కాదు, ఇప్పటికైనా ఏపీ భవిష్యత్ మీద మాట్లాడమని సవాల్ చేశాడు. అన్నిటికీ మించి పల్నాడులో సీమకి నీళ్లు ఇస్తున్నారని గొడవ… సీమలో పల్నాడుకు ఇస్తున్నారని హడావుడి చేస్తున్నావ్ దమ్ముంటే నిజాలు మాట్లాడు అని కూడా సవాల్ విసిరారు జేసీ ! వైసీపీ దీనస్థితి చూస్తుంటే పాపం జాలేస్తోంది. కనీసం విపక్షంగా అయినా ఉండాలి కదా ఏపీలో, లేకపోగా కనీసం పార్టీగా కూడా ఉనికిలో లేనట్టు మారిపోయింది పరిస్థితి. పార్టీ నాయకుణ్ని అన్నితిట్లు తిట్టాడు జేసీ, సవాల్ విసిరాడు, సబ్జెక్ట్ లేదన్నాడు. ఇవన్నీ సూటిగా తగిలే బాణాలే ! పైగా జేసీ ప్రాంతాన్ని, సామాజికవర్గాన్ని చూసినా వైసీపీపై పెను ప్రభావం చూపే డైలాగులు ఇవన్నీ ! కానీ వైసీపీ మాత్రం చలనం లేనట్టు ఉండిపోయింది. రియాక్ట్ అయ్యే దిక్కేలేదా ? సాక్షాత్తూ జగన్ ను తిట్టినా పట్టించుకోనంత బిజీ అయిపోయారా వైసీపీ లీడర్లు ?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.