పవన్ ను కలిసేందుకు రవి ప్రకాష్ వైరి వర్గం ఎత్తులు

టీవీ-9 సీఈఓ రవి ప్రకాష్ వైరి వర్గం ఇప్పుడు పెద్ద కసరత్తే చేస్తోంది. ఆయనకు వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసేందుకు వారు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వారికి అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు. తమతో ఒక్కసారి మాట్లాడితే అన్ని విషయాలు చెబుతామని.. రవి ప్రకాష్ కు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలను ఇస్తామని చెబుతున్నారట. ఇందుకు పవన్ ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. తనకు రవి ప్రకాష్ మీద వ్యక్తిగతంగా కోపం లేదని.. మీడియాలో కావాలని తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని చెప్పాను. అంతే తప్ప వ్యక్తిగతంగా ఎవరినీ ఏం చేయదల్చుకోలేదని చెప్పారంటున్నారు. వెంకటరమణ పేరుతో ఇటీవల ఓ వీడియో బయటకు వచ్చింది. వారికి సంబంధించిన వారు కలిసేందుకు పావులు కదుపుతున్నారంటున్నారు. అతనే కాదు.. మరికొంతమంది పవన్ ను కలిసేందుకు సిద్దమయ్యారు. రవి ప్రకాష్ వైరి వర్గాన్ని ప్రోత్సహించడం వల్ల అసలు లక్ష్యం దెబ్బతింటోందని.. అది తనకు ఇష్టం లేదని చెప్పారట పవన్. అదే సమయంలో అభిమానులు కాస్తంత సంయమనం పాటించాలని చెబుతున్నారు. 
ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా సాధనాల్లో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు రాయవద్దని సూచించారట. అదే సమయంలో పవన్ కల్యాణ్ పైనా కేసులు నమోదు కావడంతో వాటిని ఎలా ఎదుర్కోవాలనే విషయం పైనా పవన్ కల్యాణ్ సమాలోచనలు చేస్తున్నారు. న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా చూడాలని వారిని కోరారు. ఇంకోవైపు జనసేన పార్టీ ప్రధాన పీఆర్వో హరి ప్రసాద్ ను ఆ పదవి నుంచి తొలిగింప జేసేందుకు కొందరు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా సరే పవన్ ఆయన్ను తప్పించేందుకు ఒప్పుకోలేదు. ఫలితంగా ఇప్పుడు పవన్ వద్దకు వెళ్లాలంటే అంత తేలిక కాదంటున్నారు. మీడియాతో గొడవ పెట్టుకుంటే రేపు పార్టీ భవిష్యత్ కు ఇబ్బంది అని మధ్యే మార్గంగా ఉండే వారు కోరుతున్నారు. అందుకే అటు రవి ప్రకాష్, ఏబీఎన్ రాధాకృష్ణ-పవన్ కల్యాణ్ కు మధ్య సయోధ్య కుదిర్చేందుకు సాగుతున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. త్వరలోనే అంతా సర్దుకుపోతుందని అంటున్నారు వాళ్లు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.