‘సుధీర్‌ను పెళ్లి చేసుకో..’ అన్న నెటిజన్‌కు రష్మి ఘాటు రిప్లయ్

బుల్లితెరపై హాట్ హాట్‌గా అందాలు ఆరోబోస్తూ యాంకరింగ్‌కు కొత్త రూపును తీసుకొచ్చింది జబర్దస్త్ యాంకర్ రష్మీ. తన అందచందాలతో సినిమాల్లో కూడా నటిస్తూ దూసుకుపోతోన్న రష్మీ పెళ్లిపై ముందు నుంచి గాసిప్పులు వస్తున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉందని, వాళ్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత మూడేళ్ల నుంచే గాసిప్పులు మొదలయ్యాయి. ఇటీవల ఓ ఈవెంట్‌లో భాగంగా రష్మీ-సుధీర్ ఆన్ స్క్రీన్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ ఈవెంట్ ప్రోమో చూసి నిజంగానే వాళ్లిద్దరికీ పెళ్లి అయిందేమోనని అందరూ అనుకున్నారు. అయితే కార్యక్రమం ప్రసారం అయ్యాక కానీ అది నిజం పెళ్లి కాదని అనుకోలేకపోయారందరూ. అంతగా వాళ్లిద్దరూ ఆ పెళ్లి వేడుకలో జీవించారు. అంతేకాకుండా పలు ప్రోగ్రాముల్లో వాళ్లిద్దరూ కలిసి యాంకరింగ్‌ చేస్తూ అలరిస్తున్నారు. ఇందంతా చూసిన ఓ నెటిజన్ వాళ్లిద్దరూ చూడచక్కని జంట అని భావించి.. ‘‘సుధీర్‌ని పెళ్లి చేసుకో.. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు.. మీ కెరీర్‌ కోసం కష్టపడి పని చేస్తున్నారు’’ అంటూ ట్విట్టర్‌లో రష్మీకి సలహా ఇచ్చాడు.

 

 

 

 

 

ప్రసన్న కుమార్ అనే నెటిజన్ ఇచ్చిన ఆ సలహాపై రష్మీ ఘాటుగా స్పందించింది. ‘‘మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్‌ లైఫ్‌‌ను, రీల్‌ లైఫ్‌ను వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మా పర్సనల్ విషయాలపై మీ నుంచి ఎటువంటి సలహాలు అవసరం లేదు.’’ ఆ నెటిజన్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చింది రష్మీ.

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.