రాములమ్మ సంచలన నిర్ణయం

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి మెదక్ శాసనసభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయాక సైలంట్ అయ్యారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏమైందోకానీ రాములమ్మ మాత్రం పొలిటికల్ స్క్రీన్‌పై కనుమరుగయ్యారు. చాలా రోజుల తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ లేడీ అమితాబ్ మళ్లీ కాంగ్రెస్‌లో చురుగ్గా పాల్గొంటారని అంతా భావించారు. కానీ ఆమె మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. తెలంగాణ ఇచ్చి కూడా అధికారంలోకి రాని పార్టీ.. ఈసారి ఎలాగైనా రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. అందుకోసం ఎన్నో ప్రణాళికలను రూపొందించుకుంటోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ పార్టీకి సీనియర్ నేతల అవసరం చాలా ఉంది. అందుకే రాములమ్మను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలని కాంగ్రెస్ అధిష్టానం పలుమార్లు సంప్రదించింది. ఇందులో భాగంగానే ఆమెకు టీ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెనర్‌గా బాధ్యతలు అప్పగించింది. తాజాగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విజయశాంతి విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

చాలా రోజుల తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయిన విజయశాంతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించారు. అందుకే పార్టీలోని ఏదైనా కీలక పదవి ఆశించారు. అయితే, తాజాగా ఆమె పోటీ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని టీకాంగ్రెస్ నేతలు కోరారని, దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. వాస్తవానికి విజయశాంతిని ఎన్నికల ప్రచారానికి మాత్రమే పరిమితం చేయాలని తొలుత అధిష్టానం భావించింది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా గెలిచే అవకాశాలుండటంతో ఆమెకు ఏదో ఒక చోట టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రాములమ్మను దుబ్బాక నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయించినట్లు తెలిసింది. తాజాగా విజయశాంతి చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చూకూర్చుతున్నాయి. మంగళవారం మహాకూటమిలోని పార్టీల సీట్ల సర్ధుబాటుపై మాట్లాడిన ఆమె.. మెదక్‌, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే పోటీ చేస్తారని చెప్పారు. దీంతో ఆమెనే ఈ రెండు స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి స్వయంగా బరిలోకి దిగబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.