చిన్నోడి ధాటికి.. న‌మో ఢీలా!

ఎన్‌డీఏ స‌ర్కారుపై టీడీపీ అవిశ్వాసంపై లోక్‌స‌భ‌లో వీగినా.. తెలుగుదేశం ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు రూపంలో  ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. మాట‌ల మాంత్రికుడిగా.. పేరున్న పీఎం  న‌రేంద్ర‌మోదీ సైతం.. అబ్బో ఇక చాలంటూ సైగ‌లు చేసేంతటి వాగ్దాటితో నాయుడు ఇర‌గ‌దీసిండు. లోక్‌స‌భ‌లో అవిశ్వాసంపై మాట్లాడేందుకు టీడీపీకు ఇచ్చిన స‌మ‌యం కేవ‌లం 13 నిమిషాలు.. ఆ స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు ముంద‌స్తు ప్లాన్ బాగానే చేసుకున్నాడు. ప‌క్కా ఆధారాలతో చెల‌రేగాడు. స్ప‌ష్ట‌మైన హిందీలో దారాళంగా మాట్లాడాడు. గ‌ణాంకాలు బ‌య‌ట‌కు తీసి మ‌రీ న‌రేంద్ర‌మోదీను క‌డిగేయ‌టంతో యావ‌త్‌స‌భ నివ్వెర‌పోయింది. దాదాపు తెలుగు ప్ర‌జ‌లే కాదు.. యావ‌త్ భార‌తీయులు ప్ర‌పంచం న‌లుమూల‌లున్న తెలుగోళ్లు టీవీల‌కే అతుక్కుపోయారు.  రామ్మోహ‌న్ విరుచుకుప‌డుతున్న తీరుతో నివ్వెర‌పోయిన  స్పీక‌ర్‌… మ‌రో మూడు నిమిషాలు స‌మ‌యం ఉండ‌గానే మైక్ క‌ట్ చేశారు.

ఎవ‌రండీ.. రామ్మోహ‌న్ ‌నాయడు.. ఏమిటా దూకుడు.. ఏమిటా వాగ్దాటి.. ఎవ‌రు చెప్పారండీ అలా మాట్లాడాల‌నల‌ని. అప్పుడెప్పుడో మాజీ పీఎం అట‌ల్‌బిహార్ వాజ్‌పేయి  ప్ర‌సంగం దుమ్మ లేపేది అనేవారు. మళ్ళీ ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత అదే వాగ్దాటినీ ఉత్త‌రాంధ్ర కుర్రాడు.. సికాకుళం చిన్నోడు.. ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు క‌ళ్లెదుట సాక్షాత్కక‌రింప‌జేశాడు. ఎస్‌.. ఏపీ ప్ర‌త్యేక‌హోదా అంశంపై మాట్లాడిన తీరు అద్భుతం.. అదర‌హో.. అంటూ విప‌క్షాలు సైతం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. తెలుగు సినీ డైరెక్ట‌ర్ హ‌రీష్‌శంక‌ర్ కూడా ప్రశంసించిన వారిలో ఉన్నాడు. ఏపీకు జరిగిన అన్యాయాన్ని లోక్‌స‌భ సాక్షిగా నిల‌దీసేందుకు టీడీపీ.. బీజేపీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. ఈ సంద‌ర్భంగా టీడీపీకు ఇచ్చిన కొద్దిపాటి స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌టంలో ఎంపీ రామ్మోహ‌న్ స‌క్సెస్ అయ్యారు. పైగా.. తండ్రి ఎర్ర‌న్నాయుడు వార‌స‌త్వాన్ని కేవ‌లం రాజ‌కీయాల‌కే గాకుండా వాగ్దాటిలో కూడా అంటూ నిరూపించాడు. మాట్లాడిన ప‌ది నిమిషాలు.. హిందీ భాష‌లో అన‌ర్గ‌ళంగా దుమ్ముదులిపాడు. దాదాపు.. లోక్‌స‌భ‌లో ఉన్న ఎంపీలంతా బుడ్డోడి స్పీచ్‌తో సైలెంట్ అయ్యారంటే.. ఏ స్థాయిలో చెల‌రేగార‌నేది అర్ధం చేసుకోవ‌చ్చు. నాలుగేళ్ల పాల‌న‌లో కేంద్రం.. ఏపీకు ఇచ్చింది కేవ‌లం 5 శాతం నిధులేనంటూ.. 100శాతం నిధులు ఇవ్వాలంటే 80 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుందంటూ ఆవేద‌న వెలిబుచ్చారు. ఏపీ హోదాపై బీజేపీ ఎన్నిక‌ల మ్యానిఫెస్టోలో కూడా వివ‌రించ‌టాన్ని గుర్తుచేశారు. విశాఖ‌రైల్వేజోన్‌పై ఎందుకీ అల‌స‌త్వం అంటూ నిల‌దీశారు. కేంద్రం ఏర్పాటు చేసిన సంస్థ‌ల‌కు రైతులు భూములిచ్చారంటూ గుర్తుచేశారు. ఐదేళ్ల ప్ర‌త్యేక‌హోదాను.. ప‌దేళ్ల‌కు పెంచాలంటూ నాటి బీజేపీ నేత వెంక‌య్య‌నాయుడుడిమాండ్ చేయ‌టాన్ని ఏమంటారంటూ ప్ర‌శ్నించారు. అరుణ్‌జైట్లీ కూడా ఇదే వ‌రుస‌లో ఉండ‌టంపై ఘాటుగానే స్పందించారు. రాజ్‌నాథ్‌సింగ్ చెప్పిన మాట‌లు.. ఏపీకు నిధులు కుమ్మ‌రించామంటూచెప్పిన‌వ‌న్నీ ఒట్టి మాయ‌మాట‌లంటూ లెక్క‌ల‌తో స‌హా వెల్ల‌డించారు. వాస్త‌వానికి.. ఏపీ నుంచి  ఒక ఎంపీ.. ఇలా హిందీ.. ముఖ్యంగా ఉత్త‌రాధి ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేలా.. ఆక‌ర్షించేలా.. అర్ధ‌మ‌య్యేలా చెప్ప‌టం.. నిజంగా బీజేపీ ఊహించ‌ని దెబ్బ‌గానే భావిస్తుంది. ఎందుకంటే.. ఉత్త‌రాన‌.. హిందీ ఎక్కువ‌గా మాట్లాడ‌తారు. పైగా ఢిల్లీలో చ‌దువుకున్న ఎంపీ రామ్మోహ‌న్ సామాన్యులు అర్ధ‌మ‌య్యేలా హిందీలో ప్ర‌శ్న‌లు సంధించారు.  ఏపీ నేత‌ల‌కు హిందీకంటే.. వ‌చ్చీరానీ ఇంగ్లిషులో స్పందించ‌టం ఇప్ప‌టి వ‌ర‌కూ ఆన‌వాయ‌తీ దీంతో ఏపీ ఎంపీలు మాట్లాడినా కేంద్రాన్ని విమ‌ర్శించినా..పెద్ద‌గా పాపుల‌ర్ అయ్యేవారు కాదు.. కానీ ఇప్పుడ‌లా కాదు.. యావ‌త్‌భార‌త‌దేశం వినేలా.. ఏపీకు జ‌రిగిన అన్యాయం.. బీజేపీ ఆడుతున్న నాట‌కాన్ని లోక్‌స‌భ సాక్షిగా ర‌క్తిక‌ట్టించిన సికాకుళం సిన్నోడు.. మున్ముందు ఇంకెంత‌గా చెల‌రేగుతాడో.. చూడాల్సిందే. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.