జూ. ఎన్టీఆర్‌ను, నన్ను ప్రకృతే కలుపుతుంది: రమాప్రభ

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌పై సీనియర్ నటి రమాప్రభ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ గతంలో కంటే ఎంతో పరిణతితో కనిపిస్తున్నాడని రమాప్రభ అన్నారు. ఎన్టీఆర్‌ను కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. ‘‘ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ బాబు దగ్గర ఒకటి గమనించాను. చాలా పరిణతితో, తాత్వికతతో కనిపిస్తున్నాడు. ఎన్టీఆర్ ముఖంలో రెండేళ్ల కిందటికీ.. ఇప్పటికీ 30 ఏళ్ల తేడా కనిపిస్తోంది. ఎందుకో కలవాలనిపించింది. అలా ఉంటే ఇష్టం. కలవాలని ఎవరికీ చెప్పక్కర్లేదు. ప్రకృతే కలిపిస్తుంది. మధ్యవర్తి ఉండకూడదు. ప్రకృతి సంబంధిత విషయాలకు మధ్యవర్తి అవసరం లేదు. శూన్యమని ఒకటి అంటారు. వైబ్రేషన్ కలిపిస్తుంది. అది నా నమ్మకం. దేవుడి భజనలు, పూజలు గుడులు, నాకు సరిపోవండి. అది జరగడానికి దేవుడు, స్వామి.. అవ్వక్కర్లేదు. మన సంకల్పం పాజిటివ్‌గా ఉంటే అది జరుగుతుంది.. జరిగి తీరుతుంది’’ అని ఎంతో నమ్మకంగా చెప్పారు రమాప్రభ. కొన్ని రోజుల క్రితం ఓ వెబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రమాప్రభ ఈ విషయాలను తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.