చరణ్ సినిమాపై ఫుల్ క్లారిటీ

రామ్ చరణ్-బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా విషయంలో కొన్ని రోజులుగా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ చిత్రం ముందు అనుకున్నట్లుగా సంక్రాంతికి విడుదల కాదని.. షూటింగ్ ఆలస్యమవుతుండటంతో విడుదల వాయిదా వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం రోజు రోజుకూ పెరిగిపోతుండటం.. మెగా అభిమానులు టెన్షన్లో ఉండటం గమనించిన నిర్మాత డీవీవీ దానయ్య అప్రమత్తం అయ్యాడు. ఈ సినిమా విషయంలో వస్తున్న ఊహాగానాలన్నింటికీ తెరదించాడు. చరణ్-బోయపాటి సినిమా పక్కాగా సంక్రాంతికి విడుదలవుతుందని.. విడుదల విషయంలో మీడియోల వస్తున్న వార్తలన్నీ అబద్ధమని ట్విట్టర్లో దానయ్య సంస్థ స్పష్టం చేసింది.

దీంతో పాటుగా సినిమా షూటింగ్ స్టేటస్ ఏంటో కూడా వెల్లడించింది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్. ఈ చిత్ర టాకీ పార్ట్ నవంబరు 10కి పూర్తవుతుందట. అంతకు ఒక రోజు ముందే డబ్బింగ్ ప్రక్రియ మొదలవుతుందట. మిగతా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని కూడా వెంటనే మొదలుపెడతారట. డిసెంబరులో ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్తారట. డిసెంబరు నెలాఖరుకల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారట. ముందు అనుకున్నట్లే సంక్రాంతికి పక్కాగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని ఫిక్సయ్యారు. మరోవైపు దీపావళి కానుకగా ఈ చిత్ర టైటిల్.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని సమాచారం. ఈ చిత్రంలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది. దీనికి ‘వినయ విధేయ రామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.