రజనీకాంత్ బీజేపీతో కలిసి సాగుతాడా…

         తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ ఎత్తుల కోసం రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించాడు. ఇప్పుడున్న రాజకీయాల పైనా తన అభిప్రాయం చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. ఫలితంగా ఎవరితోను పొత్తులు లేవి చెప్పేశాడు. రజనీ `రాజకీయ రంగంలోకి అడుగుపెడతానని చెప్పడంతో మిగతా పార్టీల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎవరికి వారే రజనీతో పొత్తు పెట్టుకునే అంశం పై సమాలోచనలు చేస్తున్నాయి. వారిలో బీజేపీ ఒక అడుగు ముందుకేసింది. రజనీ తమతో పొత్తు పెట్టుకుంటారని మోదీకి ఆయన సన్నిహితుడని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. డీఎంకే కూడా రజనీకాంత్ తమవాడేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. 
          రాబోయో రాజ్యసభ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేసే అవకాశముందని రజనీ చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే పోటీ చేస్తారా లేక రాబోయే లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తారా అనేది ఇంకా తేలలేదు. పొత్తులపై – మిత్రపక్షాలపై రజనీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ 2019 ఎన్నికల్లో సూపర్ స్టార్ రజనీ పార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటుందని తమిళనాడు బీజేపీ చీఫ్ టీ సౌందరరాజన్ సంచలన ప్రకటన చేశారు. అవినీతిని అంతమొందించడం – సుపరిపాలనే తమ పార్టీ – రజనీ ల లక్ష్యమని – రజనీ రాజకీయ ప్రవేశాన్ని తాము స్వాగతిస్తున్నట్లు ఆయన చెప్పారు. 
           ప్రధాని నరేంద్ర మోడీని రజనీకాంత్ గతంలో కలిసిన సంగతి తెలిసిందే. తమిళనాడులోను రజనీకాంత్ ను కలిశారు ప్రధాని మోడీ. ఇద్దరి మధ్య జరిగిన చర్చల సారాంశంతోనే రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం లేకపోలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా దీని పై స్పందించారు. రజనీ రాజకీయాల్లోకి రావడం సంతోషమన్నారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయబోతున్నామని – రజనీ సినిమాల్లో సూపర్ స్టార్ అని – మోడీ జాతీయ రాజకీయాల్లో సూపర్ స్టార్ అని బీజేపీ నేతలు అంటున్నారు. మరోవైపు తనతో కలిసి పని చేయాలని కమల్ చేసిన విజ్ఞప్తిని రజనీ సున్నితంగా కాదన్నారు. బీజేపీపై కమల్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అందుకే రజనీ కమలం వైపు మొగ్గుచూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారం సాగుతోంది. మన్నార్ గుడి మాఫియా – అన్నాడీఎంకే,  డీఎంకే, కమల్, విజయకాంత్, శరత్ కుమార్ పార్టీలు ఇప్పటికే తమిళనాట ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రజనీ, విశాల్ లు అదే బాట పడితే ఇక కొత్త రాజకీయాలు, పొత్తులకు అవకాశాలు ఉన్నాయి. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.