రహస్యంగా రాజమౌళి కుమారుడి నిశ్చితార్థం

దర్శకధీరుడు రాజమౌళి.. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్‌. బాహుబలి సిరీస్‌తో తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటాడు. దీంతో అతడి పేరు బాలీవుడ్ నుంచి కోలీవుడ్ దాక మారుమ్రోగిపోయింది. రాజమౌళితో సినిమా తీయాలని అటు నిర్మాతలు.. ఇటు హీరోలు క్యూ కడుతున్నారంటే అతడి ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు. సహజంగా రాజమౌళికి సంబంధించినంతవరకూ ఆయన సినిమాల గురించి మాత్రమే ఎక్కువ ఫోకస్ అవుతుంటాయి. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాత్రం విషయాలు బయటకు రావు. కానీ, ఆయన కుమారుడి విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంటాయి. అతడు ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా ఇట్టే తెలిసిపోతుంటుంది. తాజాగా అతడి నిశ్చితార్థం జరిగింది. అది కూడా కుటుంబ పెద్దల సమక్షంలోనే. ఎంతో రహస్యంగా జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు పలువురు సన్నిహితులు మాత్రమే హజరయ్యారని తెలుస్తోంది. ఇంతకీ రాజమౌళి ఇంట అడుగుపెట్టబోతున్న అమ్మాయి ఎవరో తెలుసా.? ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, సీనియర్ నటుడు జగపతిబాబు అన్న కూతురు పూజా ప్రసాద్.
భక్తి గీతాలతో గాయనిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్న పూజా ప్రసాద్.. ‘జగపతి’ రాజేంద్ర ప్రసాద్ పెద్ద కుమారుడు రాంప్రసాద్ కుమార్తె. పూజ-కార్తికేయ కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్నారని, వీరి ప్రేమను కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. ఫిలింనగర్‌లోని అమ్మాయి ఇంట్లో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తోంది. ఈ సంవత్సరం చివరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం. నిశ్చితార్థం రహస్యంగా జరిగినా.. వివాహం మాత్రం అంగరంగ వైభవంగా చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇదిలాఉండగా, కార్తికేయ.. మగధీర చిత్రం నుంచి తన తండ్రి సినిమాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ‘ఈగ’ సినిమాకు ప్రొడక్షన్ మేనేజర్‌గా ఉన్న కార్తికేయ.. ‘యుద్ధం శరణం’ సినిమాకు లైన్ ప్రొడ్యూసర్‌గా పని చేశాడు. ‘బాహుబలి-2’కు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. మొత్తానికి అన్ని విభాగాల్లో చేయి వేస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నాడు. మరోవైపు వ్యాపార రంగంలో కూడా కార్తికేయ అడుగుపెట్టాడు. నగరంలో ఉన్న ఒక రెస్టారెంట్‌కు కో-ఓనర్‌గా ఉన్న అతడు.. తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్‌లో నల్గొండ ఈగల్స్ కబడ్డీ టీమ్‌కు ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.