రాజీవ్ గాంధీని చంపుతారని ముందే తెలుసట

భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 1991లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. తమిళనాడులోని శ్రీపెరంబదూరులో 1991 మే 21న ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సమయంలో రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ సభ్యులు ఆత్మాహుతి దాడిలో హతమార్చిన సంగతి తెలిసిందే. ఎల్టీటీఈ అధినేత వేలు పిళ్లే ప్రభాకరన్ స్కెచ్ వేయగా..శివరాజన్, ధాను, శోభా వంటి వారు అమలు చేశారు. ఆ తర్వాత విచారణ జరిపిన సిట్ నిందితులను తేల్చగా..వారిప్పుడు జైలు శిక్షను అనుభవిస్తున్నారు. బెల్ట్ బాంబులతో ఆయన్ను చంపేశారు. అయితే తన తండ్రి చనిపోతారని తమకు ముందే తెలుసని రాజీవ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అంటున్నారు. మిమ్ములను చంపుతారా నాన్న అని ముందే చెప్పారట. అన్యాయం, అవినీతి, అక్రమాలు, దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ఎవరూ శాశ్వతం కాదు. అయినా సరే. మన ప్రయత్నం చేయకుండా ఉంటామా అని చెప్పేవారట. రాహుల్ గాంధీ తాజాగా ఈ సంగతి బయట పెట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. 
రాహుల్‌ గాంధీ ఇప్పుడు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో గత సంగతులను నెమరేసుకున్నారు రాహుల్ గాంధీ. 
‘నాన్న చనిపోయిన తర్వాత చాలా ఏళ్ల పాటు బాధపడ్డాం. కానీ ఆయన్ని చంపినవారిని క్షమించేశాం’ అంటూ రాహుల్‌ ప్రస్తావించారు. రాహుల్‌ తన నానమ్మ ఇందిరా గాంధీ గురించి ఇలానే చెప్పారు. ‘రాజకీయాల్లో తప్పుడు వ్యక్తులకు వ్యతిరేకంగా నిలిచినా, దేని గురించైనా గట్టిగా పోరాడినా మనం చనిపోతాం. నా తండ్రి, నానమ్మ చనిపోతారని మేం ముందే ఊహించామన్నారు రాహుల్. ఆ సమయంలో ఆయన కన్నీటి భరితం అయ్యారు. తాను చనిపోతానని ముందే తెలుసని నానమ్మ నాకు చెప్పింది. ‘మీరు చనిపోతారు’ అని నేను నాన్నకు చెప్పాను. నా తండ్రిని చంపేసిన ఎల్‌టీటీఈ నేత ప్రభాకరన్‌ 2009లో చనిపోయినప్పుడు టీవీలో చూశాను. కానీ అతను నిర్జీవంగా పడి ఉండటం చూసి నాకు బాధేసింది. ప్రభాకరన్‌ని ఎందుకింత నీచంగా చంపారు అనిపించింది. అతను చనిపోవడంతో భార్య, పిల్లలు అనాథలైపోయారని బాధపడ్డారట. 
అప్పుడే ప్రియాంకకు ఫోన్‌ చేసి ‘నాన్నను హతమార్చిన ప్రభాకరన్‌ చనిపోయాడు. ఇందుకు నేను సంతోషించాలి. కానీ నాకు ఈ భావనే కలగడంలేదు అన్నాడట రాహుల్. తనకూ అలాగే ఉందని ప్రియాంక నాతో చెప్పిందని గత అనుభవాలను వివరించారు. రాజీవ్ హంతకులకు క్షమాబిక్ష పెట్టింది కాంగ్రెస్. వాస్తవంగా వారిని ఉరితీసే అవకాశం ఉన్నా..వద్దని చెెప్పారు సోనియాగాంధీ. అందుకే వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారు.
మాకు హాని చేసిన వారిని క్షమించే గుణం ఉందని చెప్పేందుకు రాహుల్ ఈ మాటలను ప్రస్తావించారు. కానీ రాహుల్ ప్రసంగం అక్కడి వారందరినీ కదిలించింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.