తప్పు చేశానని ఒప్పుకున్న హీరోయన్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ రెజినాలు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడ చేసుకుంటారని ప్రచారం వచ్చింది. తమ పెళ్లి సంగతి కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లారట. కానీ మెగా ప్యామిలీ ఇందుకు ఒప్పుకోలేదనే ప్రచారం వచ్చింది. అదే సమయంలో నీ ఇష్టం. నీ జీవితం. ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్పారట. ఫలితంగా వెనక్కు తగ్గాడు సాయి ధరమ్ తేజ్. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, రెజినాల గురించి గతంలోనే గాసిప్స్ వచ్చాయి. పిల్లా నువ్వులేని జీవితం అంటూ ఆడి పాడుకున్నారు. రెజీనా కుటుంబ సభ్యులు కూడ సుబ్రమణ్యం ఫర్ సేల్ అన్నారు. ఇద్దరు కలిసి ఆ రెండు సినిమాల్లో నటించారు. అప్పుడే ప్రేమ పుట్టిందట. ఒక దశలో ఇద్దరు కలిసి టూర్ లకు వెళ్లడం పైనా ప్రచారం వచ్చింది. తొలిగా తమిళంలో ఆ తర్వాత తెలుగులో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రెజినా తమ ప్రేమ పై ఎలాంటి మాటలు చెప్పలేదు. మరోవైపు తేజ్ ది అదే తీరు. ఫలితంగా వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే సంగతి బయటకు వచ్చింది.

నిజంగానే రెజీనాను సాయి ధరం తేజ్ ప్రేమించి పెళ్లి వరకు తీసుకెళ్లే ధైర్యం చేయలేదంటున్నారు. ఇంట్లో వాళ్లు అవును అన్నా..కాదన్నా తన మాటకు కట్టుబడి చేసుకుంటాడనుకున్నారు. కానీ అలా చేయకుండా వదిలేశాడంటున్నారు. ఇప్పుడు తాజాగా అదే సంగతి బయట పెట్టింది రెజీనా. తెలిసో తెలియకో కెరీర్‌ ప్రారంభంలోనే ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డాను. ఆ సమయంలో సినిమాల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను. నా తప్పులను నేను గుర్తించేసరికి సమయం మించిపోయిందని చెప్పింది. ఇక ఇప్పుడు ప్రేమా, పెళ్ళి జోలికి వెళ్ళదలుచుకోలేదు. మా ఇంట్లో కూడా అదే చెప్పేశాను. కొన్ని రోజుల వరకూ నా జోలికి రావద్దన్నాను. ఇప్పుడు నా దృష్టంతా కెరీర్‌ మీదేనే అని చెప్పింది.

సాయి ధరమ్ తేజ్ తో ప్రేమ సంగతిని చెప్పకనే చెప్పేసింది. తనను చేసుకుంటాడని భావించినా…ఆ పని చేయక పోడవంతో పూర్తిగా డిప్రెషన్ లోకి పోయిందట రెజీనా. అందుకే సినిమాల అవకాశాలు సరిగా లేక తల్లడిల్లుతోది. ఆమె కెరీర్ ప్రారంభమై పదేళ్లు అయినా తెలుగు, తమిళం ఏ భాషలోనైనా సరే మంచి విజయాన్ని అందుకోలేక పోయింది.

హీరో నాని స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘అ’.  ఇందులో డిఫరెంట్‌ గెటప్‌లో కనిపించనుంది రెజీనా. ఆమె గెటప్‌ కోసం స్టైలిస్టులు చాలా కష్టపడ్డారు. నాకు తెలిసి ఏ హీరోయిన్‌ ఈ గెటప్‌ కనిపించినట్టు లేదు. నేనే ఫస్ట్‌ అనుకుంటున్నాను అని చెప్పి మురిసిపోతోంది రెజీనా. ప్రేమ దోమ అనే తొక్కలో డైలాగులు నేను చెప్పను. ఇప్పటికే మోస పోయిందని చాలు. ఇక మీదట తప్పులు చేయనని చెప్పేసింది. ఈ సినిమా నేను ఎదురు చూస్తున్న విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం ఉందని చెబుతోంది. కాజల్‌, నిత్యామీనన్‌ లు ఈ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో ‘అ’ తరువాత మరో సినిమా ఒప్పుకోలేదు రెజీనా. మరోవైపు తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.