‘ఎన్టీఆర్’లో రాఘవేంద్రరావు ఎవరో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్టీఆర్’. దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ సినీ నటుడు నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయన కుమారుడు, నటుడు నందమూరి బాలకృష్ణ నటించి, నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. ఎన్టీఆర్ సినిమా జీవితానికి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. కథానాయకుడు’ అని, పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన భాగాన్ని ‘ఎన్టీఆర్.. మహానాయకుడు’గా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా అనుకున్నప్పుడు అంత హైప్ క్రియేట్ అవలేదు. కానీ, క్రిష్ ఎంటరయ్యాక దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీనికితోడు ఇందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకమ్మ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గబాటి రానా, అక్కినేని పాత్రలో సుమంత్ సహా కైకాల సత్యనారాయణ, ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌, జిష్షు సేన్‌గుప్తా, మురళీశర్మ తదితర ప్రముఖులు నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

తాజాగా ఈ సినిమాలో నటించే మరో ప్రముఖుడి గురించి ఓ వార్త బయటికొచ్చింది. నందమూరి తారక రామారావు సినీ జీవితంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాత్ర చాలా కీలకమైనది. వీరిద్దిరి కాంబినేషన్‌లో అడవి రాముడు, సింహ బలుడు, కేడీ నెంబర్ 1, డ్రైవర్ రాముడు, వేటగాడు, గజదొంగ, తిరుగులేని మనిషి, యమగోల, మేజర్ చంద్రకాంత్ వంటి 11 సినిమాలు వచ్చాయి. అందుకే ఈయన పాత్రను ఎన్టీఆర్ బయోపిక్‌లో చూపించాలని నిర్ణయించుకుందట చిత్ర బృందం. ఇంత వరకూ బాగానే ఉంది కానీ, రాఘవేంద్రరావు పాత్రలో ఎవరు చేస్తున్నారో తెలుసా..? ఆయన కుమారుడు, నటుడు, దర్శకుడు ప్రకాశ్ నటిస్తున్నాడట. ఇప్పటికే ఆయనకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయిందని సమాచారం. ప్రకాశ్ నటుడిగా ‘నీతో’, ‘మార్నింగ్ రాగా’ సినిమాల్లో నటించాడు. అలాగే దర్శకుడిగానూ మెప్పించాడు. బొమ్మలాట, అనగనగా ఓ ధీరుడు, సైజ్ జీరో వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఇందులో బొమ్మలాటకు జాతీయ అవార్డు దక్కింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.