రాచ‌మ‌ల్లు… పొద్దుటూరు టీడీపికి పే…ద్ద‌…ముల్లు

క‌డ‌పజిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్రసాద్‌రెడ్డి… టీడీపికి ప‌క్క‌ల్లో బ‌ల్లెంలా త‌యార‌య్యారు. ఇటీవ‌ల ప్రొద్దుటూరు పాత‌బ‌స్టాండ్‌లో కొన్ని దుకాణాల‌ను తొల‌గించి అన్న‌ క్యాంటీన్లను ఏర్పాటు చేయాల‌ని టీడీపీ నేత‌లు ప్రయ‌త్నించారు. అయితే పేద‌లు రోడ్డునప‌డితే తాను ఒప్పుకునే ప్రస‌క్తే లేదంటూ రాచ‌మ‌ల్లు ఆందోళ‌న‌కు దిగారు. దీంతో అధికారులు దిగివ‌చ్చి… అధికార పార్టీ నేత‌ల‌కు స‌ర్దిచెప్పి పేద‌ల‌కు ఇబ్బంది లేకుండా ఆ వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగేలా చేశారు. ఇదేవిధంగా ప్రొద్దుటూరు మున్సిప‌ల్ పార్కులో నీళ్ల ట్యాంక్ నిర్మించాల‌ని త‌ల‌పెట్టడంతో ఆయ‌న ఆందోళ‌న‌కు దిగారు.  జిల్లాజ‌డ్జి ద‌గ్గ‌ర‌కు వెళ్లిమ‌రీ ఫిర్యాదు చేశారు. దీనికితోడు క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల‌ని కోరుతూ ఎంపీ సీఎం ర‌మేష్ కంటే ముందుగానే ప్రొద్దుటూరులో  దీక్షకు కూర్చొని రాచ‌మ‌ల్లు నిబద్ధత‌ను చాటుకున్నారు. ఈ విధంగా తాను ఏం చేసినా త‌న  ప్ర‌త్యేక శైలి నిరూపించుకుంటున్నారు. ఆయ‌న తొలిసారిగా  వైసీపీ త‌ర‌పున క‌డ‌పజిల్లా ప్రొద్దుటూరు నుంచి గెలుపొందారు. ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌కు రాచ‌మ‌ల్లు అత్యంత‌ స‌న్నిహితులనే పేరుంది.
ఎప్పుడూ ఏదో ఒక ఆందోళ‌న  కార్యక్రమం చేస్తూ వార్తల్లో వ్యక్తిగా ఆయ‌న నిలుస్తున్నారు. ఇటీవ‌ల రాచ‌మ‌ల్లు వైఎస్ఆర్ సీపీ పార్టీ కండువాకు బ‌దులు న‌ల్లకండువా వేసుకుని ప‌లు కార్యక్రమాల‌కు హాజ‌ర‌వుతున్నారు. దీని అర్థం తెలియ‌క స్థానిక నేత‌లంతా త‌ల‌లు ప‌ట్టుకున్నారు. దీంతో అస‌లు విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్లడించారు. సీఎం చంద్రబాబు  ఇచ్చిన ఏ ఒక్క హామీ నెర‌వేర్చలేద‌ని, అందుకు నిర‌స‌న‌గా న‌ల్లకండువాతో నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాన‌న్నారు.  చంద్రబాబు ప‌ద‌వి నుంచి దిగిపోయే వ‌ర‌కు ఇలానే వ్య‌వ‌హ‌రిస్తాన‌ని అన్నారు. అంతేకాదు ఆ మ‌ధ్య మున్సిప‌ల్ చైర్మన్ ఎన్నిక సంద‌ర్భంగా అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న‌ద‌ని ఆరోపించార, అంత‌టితో ఆగ‌క‌  త‌న చేతిపై తానే చెప్పుతో కొట్టుకుంటూ నిర‌స‌న ప్రక‌టించి  అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.