పివికి భారతరత్న ఇవ్వాలట

గెలుపుకు దోహదం చేసే ఏ ఒక్క అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వదలడం లేదు. గతంలో చేసిన తప్పులను సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత మాజీ ప్రదాని పివి నరసింహారావును సోనియాగాంధీ కుటుంబం ఎంతగా అవమానించిందో తెలియంది కాదు. కనీసం ఆయన చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని హస్తినలోని ఏఐసిసి కార్యాలయంలో ఉంచేందుకు ఇష్టపడలేదు సోనియమ్మ. అంతగా పివిని అవమానించింది. ఆమె చెప్పినట్లు పివి చేయక పోవడమే ఇందుకు కారణం. మన్మోహన్ సింగ్ అలా చేయలేదు. సోనియమ్మ తల ఆడించమంటే ఆడించాడు. వద్దంటే ఆపాడు. అందుకే బొమ్మలా ఆయన మౌనంగా ప్రధాన మంత్రిగా ఉన్నాడు. పదవిలో లేకపోయినా అంతా తానై చక్రం తిప్పారు సోనియాగాంధీ. తెలంగాణ ఇవ్వాలని ఆమె ఆలోచించారు కాబట్టే వచ్చింది. లేకపోతే లేదు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఆ ప్రాంత ప్రజలు సరిగా గుర్తుంచుకోలేదు. కేసీఆర్ టీమ్ పోరాటం చేయడం వల్లనే తెలంగాణ వచ్చిందని నమ్మారు. ఆ పార్టీకి పట్టం గట్టారు. 
కానీ ఎన్నికల్లో గెలిచాక తాము తప్పు చేశామనే భావనలో ఉన్నారు జనాలు. కేసీఆర్ చెప్పేదొకటి. చేసేది మరొకటి. బంగారు తెలంగాణ కాదు గదా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లోనే బాగుందనే మాట చెబుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ కొత్త జపం చేస్తోంది. అదేనండి మాజీ ప్రధాని పివి నామం జపిస్తోంది. చనిపోక ముందు చనిపోయాక ఆయన్ను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పుడు ఆయన భారత రత్న ఇవ్వాలని కోరుతోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కు పివి నరసింహరావు గుర్తుకు రాలేదు. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా పిివికి భారతరత్న అవార్డు ఇవ్వాలనిడిమాండ్ చేస్తోంది. 
ఏపీకి హోదా విషయంలోను కాంగ్రెస్ అలానే నాటకాలు ఆడింది. విభజన చట్టాన్ని సరిగా రూపొందించకుండా ఏపీని నిలువునా మోసం చేసిన ఘనత సోనియాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీదే. ఇప్పుడు పివి విషయంలోను అదే పని చేస్తోంది. తాము చేయాల్సిన పనిని చేయకుండా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. పివికి భారత రత్న ఇవ్వాలని సిఎల్పి నేత జానారెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు వారికి గుర్తుకు రాలేదు. బీజేపీ ఎలాగు ఇవ్వదనే ఆలోచనతో జానారెడ్డి కొత్త ప్రతిపాదన చేశారంటున్నారు. ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు. అరవైఏళ్లపాటు రాజకీయాలలో ఉన్న పివి దేశంలోనే సంస్కరణలకు ఆద్యుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. 
ఆర్థికవేత్తగా, రాజకీయ సంస్కర్తగా, బహుభాషాకోవిదుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందని జానా అంటున్నారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు ప్రతిపాదన చేశారు..సోనియాగాంధీకి ఈ విషయం తెలిస్తే ఊరుకుంటారా అనే చర్చ సాగుతోంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.