నంద‌మూరి వార‌సురాలి మెడ‌లో వైసీపీ కండువా!

భార‌తీయ‌జ‌న‌తాపార్టీకు త్వ‌ర‌లో ఊహించ‌ని షాక్ త‌గులబోతుంద‌ట‌. పైగా.. దానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ వేదిక కావ‌ట‌మే బీజేపీ నేతల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తున్న విష‌యం. ఔను.. ఏపీలో అధికారం సంగ‌తి ఎలా వున్నా.. క‌నీసం కొన్ని సీట్లు గెలిచి నిరూపించుకుంటే చాలంటూ టీడీపీ ఏనాడో బీజేపీకు స‌వాల్ విసిరింది. ఏపీ ప్ర‌త్యేక‌హోదా విష‌యంలో టీడీపీ, బీజేపీ మ‌ధ్య పొత్తు చివ‌ర‌కు చేరింది. కొద్ది నెల‌ల క్రితం ఇద్ద‌రూ క‌టీఫ్ చెప్పుకున్నారు. దీంతో ఒక‌రిపై ఒక‌రు ప‌గ సాధించేందుకు అటు మోదీ, ఇటు చంద్రబాబునాయుడు ఇద్ద‌రూ ఎవ‌రి ఎత్తులు వారు వేసుకునే ప‌నిలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిగా కాపు వ‌ర్గానికి చెందిన క‌న్నా ల‌క్ష్మినారాయ‌ణ‌కు అప్ప‌గించారు. అప్ప‌టి వ‌ర‌కూ సోము వీర్రాజు, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రీ పేర్లు వినిపించినా.. చివ‌ర్లో టీడీపీ అంటే ఒంటికాలుపై లేచే క‌న్నాకు సీటు బెర్త్ ఓకే చేశారు.
దీని వెనుక రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. కాపు వ‌ర్సెస్ క‌మ్మ రాజ‌కీయాల్లో తాము ల‌బ్ది పొందాల‌నేది బీజేపీ వ్యూహంగా క‌నిపిస్తుంది. అయితే.. అప్ప‌టి నుంచి కాస్త బెట్టుగా ఉంటున్న పురేందేశ్వ‌రీ ఎక్క‌డా త‌న అయిష్టాన్ని వ్య‌క్తం చేయ‌లేదు. అయితే.. హోదా విష‌యంలో బీజేపీపై ఏపీలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త‌తో త‌మ‌కు రాజ‌కీయంగా భ‌విష్య‌త్ ఉండ‌ద‌నే ఆలోచ‌న‌తో ద‌గ్గుబాటి కుటుంబం వైసీపీలోకి మారాల‌నే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది. దీనిపై ఇప్ప‌టికే వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. కొంద‌రు సీనియ‌ర్లు.. పురందేశ్వ‌రీ, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితే.. బీజేపీ నుంచి మ‌రికొంద‌రు నేత‌లు కూడా అటు వైసీపీ, ఇటు టీడీపీలోకి చేర‌వ‌చ్చ‌ని ప్రచారం సాగుతుంది. దీనివల్ల ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ మ‌రింత బ‌లోపేతం కావ‌చ్చ‌నేది జ‌గ‌న్ వ్యూహం. గుంటూరు, కృష్ణాజిల్లాలో క‌మ్మ‌సామాజిక‌వ‌ర్గం ఓట్ల‌ను దండుకోవ‌చ్చనే ప్లాన్ కూడా ఉంద‌ట‌. కాపుల ఓట్లు దూర‌మ‌వుతున్న స‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం ఓట్ల‌ను ద‌గ్గ‌రు చేర్చుకోవ‌టం ద్వారా రెండింటి మ‌ధ్య స‌మ‌తూకం  ఉంటుంద‌నేది  జ‌గ‌న్ ఆలోచ‌న‌. ఈ లెక్క‌న పురందేశ్వ‌రీ వైసీపీలోకి చేర‌టం.. క‌మ‌ల‌నాధుల‌కు కోలుకోలేని దెబ్బ‌గానే పార్టీ భావిస్తుంది. 

1 Comment

  1. Ycp lo dagupati cherite NTR atma kshobhinchada. Etochi ee eddaru sannasulu ycp lo cherite vuna balam kuda potundi. Kani anta bjp di nakina purandhareswari enduloki velina as party nasanam. Modi ki oka jhalakh.

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.