ఆ ఎంపీ సీటుపై పురందేశ్వరి కన్ను?

అందుకే వైసీపీపై దృష్టి?
టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు కుమార్తెగా పురందేశ్వరి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. టీడీపీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పురందేశ్వరి.. చంద్రబాబుతో రాజకీయ విభేదాల కారణంగా కాంగ్రెస్ దిశగా కదిలారనేది విదితమే. ఈ నేపద్యంలో కేంద్ర మంత్రి పదవి కూడా అలంకరించారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో పురందేశ్వరి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. ఆమె టీడీపీ నుంచీ కాంగ్రెస్ లో చేరడం ఒక సంచలనమైతే, తరువాత కాంగ్రెస్ నుంచీ బీజేపీలోకి రావటం అంతకన్నా మించిన సంచలనం! బీజేపీ, టీడీపీ పొత్తు వున్న సమయంలో కూడా చంద్రబాబు సర్కార్ లో ఆమె భాగస్వామ్యం కాలేకపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికల సీజన్ వస్తుండటంతో పురందేశ్వరి పార్టీ మారుతారనే ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
మరోవైపు బీజేపీలోనే వున్న పురందేశ్వరి వైసీపీలో చేరి, విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది!  ఇందుకు జగన్ కూడా ఓకే చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంత వరకూ నిజమో కాలమే చెప్పాలి, అయితే పురందేశ్వరి ఇలాంటి నిర్ణయం తీసుకోటానికి అవకాశాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. కుమారుడి పొలిటికల్ ఎంట్రీకి ఆమె ఈ మార్గాన్ని ఎంచుకున్నారనే టాక్ వినిపిస్తోంది. పురందేశ్వరి తనయుడు పరుచూరు నియోజకవర్గం నుంచీ పోటీ చేయాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. గతంలో దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఇక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. అందుకే వారి కుమారుడిని కూడా పరుచూరు నుంచి పోటికి దింపాలని వారు యోచిస్తున్నారట. అందుకే బీజేపీలో వున్న పురందేశ్వరి అదే పార్టీ నుంచీ కొడుకును పోటీకి నిలబెట్టి రిస్క్ చేయాలనుకోవడం లేదట. అలా అని టీడీపీ నుంచి పోటీ చేసే అవకాశం కూడా లేదు. దీనికి చంద్రబాబుతో పురందేశ్వరి దంపతుల విభేదాలే కారణమనే వాదన ఉంది. ఇక వారికి మిగిలిన అవకాశం జగన్ పార్టీనే! అందుకే, పురందేశ్వరి తాను బీజేపీని వీడి వైసీపీలో చేరి, కొడుకును కూడా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేయించాలని భావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపద్యంలోనే పురందేశ్వరి విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని కూడా భావిస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.