పురందేశ్వరిని నిలదీస్తున్న తెలుగు జనం

కర్నాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లారు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి. బీజేపీని గెలిపించాలని ఎన్నికల ప్రచార సభలో పిలుపునిచ్చారు. రాయచూర్ సభలో పురందేశ్వరి మాట్లాడుతున్న సమయంలోనే సాంబశివరావు అనే రైతు ఆమెను నిలదీశారు. అమ్మా… మీరు పోయినసారి వచ్చి కాంగ్రెస్ కు ఓటేయమన్నావు. వేసినాం. అన్న ఎన్టీఆర్ కూతురు మన ఇంటికి వచ్చిందనే సంతోషంతో అందరితో ఓటేయించాం. ఫలితంగా కాంగ్రెస్ కర్నాటకలో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీజేపీకి ఓటేయమంటున్నావు. మాకు అభ్యంతరం లేదు. మీమీద గౌరవంతో ఓటేస్తాం. కానీ మీరు ఎందుకు ఏపీకి అన్యాయం చేసే పార్టీకి ఓటేయమని చెబుతున్నావు అన్నారు. అంతే అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. ఏపీని నిలువునా విభజించింది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు తలుపులు మూసేసి మరీ ఆ పని చేసింది. విభజన చట్టాన్ని సరిగా రూపొందించలేదు. హోదాను చట్టబద్దం చేయకుండా హామీనిచ్చి ఊరుకుంది. అందుకే తెలుగు వారంతా కాంగ్రెస్ అంటే మండిపడుతున్నారు. ఆ ఫలితం ఏపీ కాంగ్రెస్ కు కనపడింది. ఒక్కటంటే ఒక్క సీటు వారికి రాలేదు. 
ఆ తర్వాత ఏపీకి హోదా ఇస్తామని చెప్పింది బీజేపీ. ఇప్పుడు మాట మారుస్తోంది. 2014 ఎన్నికల్లో తిరుపతి కేంద్రంగా మోడీ చెప్పిన మాటలను గుర్తు చేశారు జనాలు. అందుకే పురందేశ్వరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏపీని ఆదుకునేందుకు బీజేపీ సిద్దంగా ఉందని.. రాబోయే కాలంలో అన్ని రకాలుగా ఆదుకుంటుందని చెప్పి అక్కడ నుంచి వెళ్లి పోయారు. తెలుగు వారి వద్దకు పురందేశ్వరిని పంపితే ఓట్లు వస్తాయనుకుంటే ఇలా రివర్స్ అవుతుందని భయపడుతున్నారు పురందేశ్వరి. ఫలితంగా బళ్లారి, రాయచూర్ వంటి ప్రాంతాల్లో బీజేపీకి ఇబ్బందికర వాతావరణం ఉంది. ఇంకోవైపు బళ్లారి మైనింగ్ కింగ్ గా ప్రసిద్ది గాంచిన గాలి జనార్దన్ రెడ్డిని రంగంలోకి దింపడం బీజేపీకి మైనస్ గానే ఉంది. ఆ ప్రభావం మిగతా ప్రాంతాల పైనా పడుతుందంటున్నారు. 
అందుకే వీలున్నంత తొందరగా ఎన్నికల ప్రచారం ముగించుకుని తిరిగి వచ్చేందుకు ఏపీ బీజేపీ నేతలు ఎదురు చూస్తున్నారు. సభల్లో మాట్లాడటం తప్ప అడిగేందుకు ఎవరికీ అవకాశం ఇవ్వడం లేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.