ల‌గ‌డ‌పాటి స‌ర్వేపై జ‌నంలో టాక్ ఏంటి?

తెలంగాణ ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందా అని అంద‌రూ చాలా ఉత్కంఠ‌తో ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీ గురించి అనాల‌సిస్ చేసినా ఒక్కొక్క‌రికి ఒక్కో బ‌లం క‌నిపిస్తోంది. అయితే, తెలంగాణ‌లో పొత్తుల వ‌ల్ల‌.. ఇపుడు ఇద్ద‌రే పోటీలో ఉన్న‌ట్లు అనుకోవాలి. ఒక‌టి కాంగ్రెస్‌… రెండు టీఆర్ఎస్‌. ఇరు వ‌ర్గాల మ‌ధ్య హోరాహోరీ పోరు సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో ల‌గ‌డ‌పాటి స‌ర్వే అయినా వ‌స్తే ఊపిరి పీల్చుకుందాం అని అటు ప్ర‌జ‌లు, ఇటు నాయ‌కులు భావిస్తున్న నేప‌థ్యంలో ఆయ‌న ట్రైల‌ర్ లాగా త‌న స‌ర్వేలో శాంపిల్ పీస్ వ‌దిలారు. మ‌ధ్యాహ్నం త‌ర్వాత ఓ టీవీ ఛానెల్ చేసిన చిన్న ఇంట‌ర్వ్యూలో ఆయ‌న రెండు విష‌యాలు చెప్పారు. ఒక‌టి 8 మంది ఇండిపెండెంట్లు గెలుస్తున్నార‌ని, ఇంకోటి ఈసారి తెలంగాణ‌లో హంగ్ రావ‌డం లేద‌ని అన్నారు.
ఇపుడు రాష్ట్రమంత‌టా దీనిపైనే చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణలో ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పిన ఆయన మాటను కొంద‌రు ఇలా విశ్లేషించారు. టీఆర్ఎస్ పార్టీ మొద‌టి నుంచి ఎంఐఎంను పాంప‌ర్ చేస్తోంది. వారు గుడ్డిమామ క‌న్నా మెల్ల‌క‌న్ను మామ బెట‌ర్ అని టీఆర్ఎస్‌ను అవ‌మానిస్తున్నా… టీఆర్ఎస్ మాత్రం ఆ పార్టీతో రాసుకుపూసుకు తిర‌గ‌డానికి తెగ ఆసక్తి చూపిస్తోంది. దీనికి కార‌ణం.. ఆ పార్టీ బ‌లంగా లేన‌ట్టు స‌ర్వేలు రావ‌డం వ‌ల్లే ఎంఐఎంతో బాగుంటే సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటుచేయొచ్చ‌ని కేసీఆర్ ఆశిస్తున్నార‌ని అంటున్నారు. అంటే… హంగ్ రావ‌డం లేద‌ని ల‌గ‌డపాటి చెప్పారంటే… క‌చ్చితంగా కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఉంద‌ని ప్ర‌జాకూట‌మి అధికారంలోకి వ‌స్తుంద‌ని అనుకోవ‌చ్చంటున్నారు. బ‌హుశా కేసీఆర్-కేటీఆర్ మోస‌పోవ‌ద్దు అని ప్ర‌జ‌ల‌ను బ‌తిమాల‌డానికి కూడా కార‌ణం ఇదే అని తెలుస్తోంది. ఇటీవ‌ల క‌విత కూడా కేసీఆర్‌లాగే మాట్లాడింది. తెరాస నేత‌లు కూడా పార్టీకి ఈస‌మ‌యంలో రాజీనామాలు చేస్తున్నారంటే… ఏదో క‌చ్చిత‌మైన స‌మాచారం ఉండ‌బ‌ట్టే అని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.