ప్రవాసాంధ్ర భరోసా భీమా

ప్రవాసాంధ్రుల  శ్రేయస్సు  కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా.చంద్రబాబునాయుడు గారు చేసిన ఆలోచనల నుండి ఏర్పడిందే ఈ నాన్ రెసిడెంట్ తెలుగు సోసైటీ APNRT. విదేశాలలో రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వంటివి సంభవించినపుడు,  ప్రభుత్వాల పాలసీలలో మార్పుల వల్ల NRT లు ఇబ్బందులకు గురైనపుడు APNRT వారికి అండగా నిలుస్తోంది

ప్రపాసాంధ్రులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిలా వ్యవహరిస్తూ, మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టటానికి, అభివృధ్ది కార్యక్రమాలు చేపట్టటానికి వెసులుబాటు కల్పిస్తున్న APNRT  ప్రవాసాంధ్రులకు అందిస్తున్న సేవలలో ప్రధానమైనది ఈ ప్రవాసాంధ్ర భరోసా భీమా.

ఇప్పటివరకు APNRT లో సభ్యత్వం పోందిన దాదాపు 70 వేలమందిలో, గడచిన నెల రోజులలోనే రెండున్నర వేలమంది ఈ భీమా పధకం కింద రిజిష్టర్ చేసుకున్నారు.  మిగిలిన వారందరినీ కూడా ఈ భీమా ఛత్రం కిందకు తీసుకువచ్చి, వారి ఆరోగ్యానికి, జీవితానికి కూడా భరోసా  అందించటానికి  APNRT  డైరెక్టర్ చప్పిడి.రాజశేఖర్ అధ్వర్యంలో  ఇప్పటికే రాష్ట్రంలోని కడప, చిత్తూరు, కృష్ణా లతోపాటు అనేక ఇతర జిల్లాలలో ఎన్.ఆర్.టి ల కుటుంబ సభ్యులకు ఈ భీమాపధకం పై అవగహనా కార్యక్రమాలు నిర్వహించింది.

ఈ భీమాను ప్రధానంగా ఉద్యోగులు, విద్యార్ధులు అనే రెండు వర్గాల వారిని లక్ష్యంగా చేసుకోని రూపోందించారు.  ఈ రెండు వర్గాల వారు కూడా కేవలం నామమాత్రపు ప్రీమియం చెల్లిచటం ద్వారా 10 లక్షల ప్రమాద భీమాను, అదేసమయంలో అనారోగ్యానికి గురైనపుడు 1 లక్ష రూపాయల వరకు చికిత్సకు కూడా పోందవచ్చు.

APNRT లో సభ్యత్వం పోందిన ప్రవాసాంధ్రులు, 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంటే ఈ పధకానికి అర్హులుగు పరిగణింపబడతారు. 

          పేరు, పుట్టినతేదీ, పాస్పోర్టు నంబరు, వీసా వివరములు, మోబైల్ నంబరు, పని చేస్తున్న లేదా చదువుతున్న సంస్ధ చిరునామా లు అందించటం ద్వారా ఈ పధకంలో ఉచితంగా  రిజిష్టర్ చేసుకోవచ్చు.

 

ఉద్యోగులకు ఈ భీమా వల్ల కలిగే ప్రయోజనాలు.

 • బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణిస్తే లేదా శాశ్వత అంగవైకల్యం కలిగి విదేశములో ఉద్యోగాన్ని కోల్పోయినట్లయితే 10 లక్షల రూపాయలు.
 • ప్రమాదం వలన మరణం సంభవించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినపుడు, మృతదేహాన్ని/అంగవైకల్యం కలిగిన వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశానికి వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు.
 • ప్రమాదం వలన సంభవించే గాయాలు/అస్వస్థత చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల చెల్లింపు.
 • బీమా చేయబడిన వ్యక్తి అస్వస్థత కు గురై ఉద్యోగం చేయడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు.
 • బీమా చేయబడిన మహిళా ప్రవాసాంధ్రులు బీమా కాలపరిమితి లో సాధారణ ప్రసూతి ఖర్చుల క్రింద 35 వేల రూపాయలు లేదా సిజేరియన్ ఆపరేషన్ ఖర్చుల క్రింద 50 వేల రూపాయలు.
 • బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వలన మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన, వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి ఖర్చుల క్రింద బీమా కాలపరిమితి వరకు సంవత్సరానికి 50 వేల రూపాయలు.
 • ఉద్యోగ సమయంలో కంపెనీ యాజమాన్యం తో ఏవేని సమస్యలు తలెత్తినట్లైతే, ఆ సమస్యల పరిష్కారానికి అయ్యే న్యాయ పరిష్కార ఖర్చుల క్రింద 45 వేల రూపాయలు.

విద్యార్ధులకు ఈ భీమా వల్ల కలిగే ప్రయోజనాలు

 • బీమా చేయబడిన విద్యార్ధి విదేశాలలో ప్రమాదంలో మరణించిన, శాశ్వత అంగవైకల్యం కలిగిన చో 10 లక్షల రూపాయలు.
 • బీమా చేయబడిన విద్యార్ధి ప్రమాదం వలన మరణం సంభవించినప్పుడు లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినపుడు, మృతదేహాన్ని/అంగవైకల్యం కలిగిన వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశానికి వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు.
 • విద్యార్ధికి ప్రమాదం వలన సంభవించే గాయాల చికిత్సకు అయ్యే ఆసుపత్రి ఖర్చుల క్రింద లక్ష రూపాయల చెల్లింపు.
 • బీమా చేయబడిన విద్యార్థి ప్రమాదమునకు గురై చదువు కొనసాగించడానికి అనర్హుడిగా గుర్తించినట్లైతే ఆ వ్యక్తి మరియు ఒక సహాయకునికి స్వదేశం వచ్చేందుకు అయ్యే సాధారణ తరగతి విమాన ఛార్జీలు.

మహిళలకు ఈ భీమా వల్ల కలిగే ప్రయోజనాలు

      బీమ చేయించుకున్న మహిళా ప్రవాసాంధ్రులు బీమా కాలపరిమితి లో సాధారణ ప్రసూతి ఖర్చుల కింద 35 వేల రూపాయలు, సిజేరియన్ చేయవలసిన సందర్భంలో 50 వేల రూపాయలు పోందుతారు.

 ప్రతి ప్రవాసాంధ్రుడూ ఈ ఉచిత భీమా పధకాన్ని వినియోగించుకోని లబ్ది పోందలానే లక్ష్యంతో  ఇప్పటికే NTR  వైద్య సేవ పై ప్రజలకు అగాహన కల్పిస్తున్న సెర్ఫ్ సహకారంతో, గ్రామాలలోని భీమా మిత్రలు, వెలుగు సభ్యులు ఈ కార్యక్రమాన్ని గురించి NRT ల కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, వారిని భీమా ఛత్రం కిందకు తీసుకు వస్తున్నామని APNRT ప్రెసిడెంట్ Dr. రవి వేమూరు తెలిపారు.   తద్వారా లక్షలాదిమంది తెలుగు వారికి ఈ పధకం వర్తించేలా APNRT కార్యక్రమాన్ని రూపోందించింది.  

 విదేశాలలో ఉంటున్న తెలుగువారి బంధువులు తమ గ్రామాలలో గల వెలుగు గ్రామ సంఘాలను సంప్రదించి,  ఈ క్రింది వివరాలు అందించి, భీమా ప్రీమియం చెల్లించటం ద్వారా భీమా పధకం కింద రిజిష్టర్ చేసుకోవచ్చు.

భీమాను క్లెయిమ్ చేసే విధానం కూడా ఎంతో సరళతరంగా ఉండేలా APNRT విధి విధానాలను రూపోందించింది. APNRT HELP LINE  నంబర్లు 

+91 86323 40678       మరియు    +91 85000 27678

కు ఫోన్ చేసి, భీమా వివరాలను అందిస్తే, వెంటనే అవసరమైన  చర్యలు చేపడతారు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.