జగన్ నమ్మకాన్నినిలబెట్టడంలో ప్రశాంత్ కిశోర్  వెనుకంజ?

రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరున్న ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ తనపార్టీ అభివృద్ధి కోసం ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయం విదితమే! తన పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు జగన్… ప్రశాంత్ కిషోర్ టీమ్‌ సలహాలకు ప్రాధాన్యత నిస్తున్నారని తెలుస్తోంది. అలాగే ఆ బృందానికి భారీ మొత్తాలను వేతనంగా ఇస్తూ స్ట్రాటజిస్టులుగా నియమించుకున్నారని సమాచారం. తాను ఒక్కడే కష్టపడితే వైసీపీకి అధికారం అందదని, తాను కష్టపడుతున్న రీతిలో కింది స్థాయిలో వైసీపీ నియోజకవర్గాల ఇన్ చార్జిలు కష్టపడితేనే వైసీపీకి అధికారం అందడం ఖాయమని జగన్ భావించారు. అందుకే కిందిస్థాయి నేతలకు గైడెన్స్ ఇచ్చేందుకు జగన్  పీకే టీమ్ ను ప్రత్యేకంగా నియమించారని తెలుస్తోంది. కింది స్థాయి నుంచి చక్కటి మేనేజ్ మెంట్ తోనే విజయం దక్కుతుంది. వైసీపీ ఇన్ చార్జిలకు కూడా గత ఎన్నికల ఫలితాల తర్వాత ఈ విషయం అర్థమైంది. అందుకే వీళ్లకు గైడెన్స్ అందించే బాధ్యతను ప్రశాంత్ కిశోర్ చేతుల్లో పెట్టారట! అయితే ప్రస్తుతం పీకే టీమ్ అచేతనంగా కనిపిస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఐదు నెలలుగా ప్రశాంత్ కిషోర్ టీమ్ వైసీపీ కోసం ఎలాంటి ప్రోగ్రామ్స్ నూ చేపట్టలేదనే వార్తలు వస్తున్నాయి. గతంలో నియోజకవర్గాల స్థాయిల్లో జగన్ పార్టీ గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ తర్వాత మరే కార్యక్రమాన్నీ వైసీపీ గట్టిగా నిర్వహించలేదని తెలుస్తోంది. నియోజక వర్గాల స్థాయిలో మళ్లీ ఏం చేయాలనే దాని గురించి నియోజకవర్గాల ఇన్ చార్జిలు అడుగుతున్నారట.
అయితే ప్రశాంత్ కిశోర్ టీం ఈ విషయంలో ఎలాంటి దిశానిర్దేశం చేయడంలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఏవో రెండు మూడు కార్యక్రమాలను ప్రతిపాదించినా, అవి కేవలం ప్రతిపాదనలుగానే మిగిలాయంటున్నారు. పైగా ఈ కార్యక్రమాల ప్రకటనతో వైసీపీలో కొత్త ఉత్సాహం రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీని ఎక్కడికో తీసుకువెళతారని జగన్ ప్రశాంత్ కిశోర్ ను నియమించుకుంటే అందుకు తగిన ప్రతిఫలం దక్కడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా జనన్ పీకే టీమ్ పై ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. ఇకనైనా జగన్ పీకే టీమ్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా జిల్లాలను కవర్ చేశారు.  ఇక మరో మూడు జిల్లాలు మాత్రమే పెండింగులో ఉన్నాయని తెలుస్తోంది. వీటిని కొనసాగించే పనిలో జగన్ నిమగ్నమయ్యారు. పాదయాత్రతో జగన్ ఇమేజ్ అనేక రెట్లు పెరిగిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.