ప్రణబ్ ఎందుకు వెళుతున్నాడో…

నాగపూర్ లో జరగనున్న ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరు కావాలన్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెళ్లనున్నారు. అదే ఇప్పుడు వివాదాన్ని రేపుతోంది. ప్రణబ్ జీ ఇప్పుడు స్వతంత్రుడు. ఏపార్టీకి చెందిన వ్యక్తి కారు. కానీ ఆయన వెళ్లేందుకు నిర్ణయం తీసుకోవడం పై దుమారం రేగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ నేతలకు అది రుచించడం లేదు. గతంలో మాజీ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రు, ఇందిరాగాంధీలు సైతం ఆర్ఎస్ఎస్ సభలకు వెళ్లిన సంగతి తెలిసిందే. పైగా ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ నేత కాదు. కానీ అభ్యంతరం మాత్రం బాగా వస్తోంది. 
ప్రణబ్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ రైల్వే శాఖ మంత్రి సి.కె.జాఫర్ షరీఫ్ ఏకంగా  లేఖ రాశారు. ఆ కార్యక్రమానికి వెళ్ళాల్సిన అవసరం ఏమిటని ఆ తన లేఖలో ప్రశ్నించారు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన వ్యక్తి ఏ పార్టీ పట్లా మొగ్గు చూపబోరని తాము ఆశించామన్నారు. దాదా వైఖరి తమకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించిందని షరీఫ్ అనడం ఆశ్చర్యమే. రాష్ట్రపతిగా ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అభ్యర్థిత్వానికి మద్దతునివ్వాలని గతంలో షరీఫ్..ప్రధాని మోదీకి రాసిన లేఖలో కోరారు. మోహన్ భగవత్ సిద్ధాంతాలు ఎలా ఉన్నా.. ఆయన దేశభక్తిని కాదనకూడదన్నారు. సంఘ్ పరివార్ ఆహ్వానాన్ని ప్రణబ్ ముఖర్జీ మన్నించడం మంచి ముందడుగని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చన్న తీరు చోటు చేసుకుంటోంది. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్, కేసీఆర్ వంటి వారు ప్రణబ్ ముఖర్జీ వెనుక ఉన్నారు. కాబట్టి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతాయంటున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తున్న నేతలకు ప్రణబ్ ఇప్పుడు పెద్ద మనిషిలా కనపడ్డాడు. ఆయన సలహాలు సూచనలతోనే కర్నాటకలో పెద్ద ఎత్తున నేతలంతా కలిశారనే వాదన లేకపోలేదు. ఇప్పుడు హఠాత్తుగా ప్రణబ్ వైఖరి వారిని ఆలోచనలో పడేసింది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.