మోడీకి కొరకరాని కొయ్యగా మారిన ప్రకాష్ రాజ్

సినీ నటుడు ప్రకాష్ రాజ్ తెగించాడు. దేనికైనా సై అంటున్నాడు. పోరాడితే పోయేది ఏముంది. హోదా రావడం తప్ప అంటున్నాడు. తనకు పాత్రలు లేకుండా చేసేందుకు బీజేపీ సర్కారు సిద్దమైందని చెప్పారు. అంతే కాదు.. యాడ్స్ రాకుండా అడ్డుకుంటున్న వైనాన్ని వివరించారు ప్రకాష్ రాజ్. ఫలితంగా ప్రకాష్ రాజ్ ను ఏం అనలేకపోతోంది బీజేపీ. అందుకే విరుచుకుపడుతున్నారు. ఇలాంటి అబద్దాల ప్రధానిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అక్కడి ప్రజలను మోడీ వంచించారని విమర్శించారు. అందుకే కర్నాటక ఎన్నికల్లో తెలుగువారు తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అంతే కాదు.. జర్నలిస్టుల హత్యలు జరుగుతున్నా.. చేతగాని స్థితిలో బీజేపీ సర్కార్ ఉండటం విచిత్రంగా ఉందన్నారు. ఏపీ ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కి ఏదో ఒకటి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ కితాబునిచ్చారు. 
కేంద్ర సర్కారు నుంచి సాయం అందడం లేదు. అందుకే చంద్రబాబు నిస్సహాయంగా ఉన్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబును ఏమీ అనలేమని చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలు ప్రత్యేక హోదాని అడుక్కోవడం లేదని, అది సాధించుకోవడం వాళ్ల హక్కని ప్రస్తావించిన తీరు హాట్ టాపికైంది. జనాల్లో చైతన్యం తీసుకురావాలని.. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటానని చెప్పడంతో బీజేపీకి దిక్కుతోచడం లేదు. ఏం చేసినా ప్రకాష్ రాజ్ వెనక్కు తగ్గేలా లేరు. అందుకే మౌనంగా ఉంటేనే మేలు అని ఆలోచిస్తోంది కమలం పార్టీ. బీజేపీ నేతల బుర్రల్లో ఏమీ లేదని.. ఎప్పుడు ఎదుగుతారో తెలియడం లేదని అనడం మరింతగా చర్చనీయాంశమైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.