మోడీ మొగుడు… రాహుల్ తో జ‌త‌క‌ట్టాడు

ఈబీసీ బిల్లు ఎన్నిక‌ల ముందు తెచ్చాడు అంటే… మోడీ ఆల్మోస్ట్ డిఫెన్స్‌లో ప‌డ్డ‌ట్టే. అంటే బ్ర‌హ్మాస్త్రాలు లేనిదే ఈ సారికి మోడీ ప‌ని కాదు అని మోడీకి కూడా అర్థ‌మైపోయింది. పాపం వంద గొడ్ల‌ను తిన్న రాబందు ఒక్క గాలివాన‌కు చ‌చ్చిన‌ట్టు… ఒక‌ప్పుడు దేశంలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుల నోళ్ల‌న్నీ మూయించి త‌న‌ది కొత్త రాజ‌కీయ అని బిల్డ‌ప్ ఇచ్చిన మోడీ… ఇపుడు రాహుల్ చేతిలో కూడా తేలిపోయి పారిపోయే ప‌రిస్థితి.
మొన్న పార్ల‌మెంటులో అవును/కాదు … అని ఏదో ఒక‌టి చెప్ప‌మ‌ని రాహుల్ అడిగిన ఒక చిన్న ప్ర‌శ్న‌కు మోడీ నోరు తెర‌వ‌లేదు. రాఫెల్ డీల్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వలేదనేది నిజం కాదా? అని అడుగుతుంటే మోడీ భ‌క్తుల‌కు ఏం చెప్పాలో తెలియ‌డం లేదు. ఆ ఒక్క ప్ర‌శ్న‌కు త‌ప్పించుకోవ‌డానికి సంబంధంలేని మాట‌ను ప‌ట్టుకుని రాహుల్‌కు నోటీసులు కూడా ఇప్పించారు. రాఫెల్ స్కాం బారి నుంచి భ‌ద్ర‌త కార‌ణాలు చూపి సుప్రీంకోర్టు నుంచి త‌ప్పించుకున్నా… పార్ల‌మెంటు నుంచి త‌ప్పించుకోలేక‌పోతున్నారు మోడీ. చివ‌ర‌కు రాహుల్ అడిగిన అన్ని విష‌యాల‌ను గాలికి వ‌దిలేసి ఒక సంబంధం లేని విష‌యంపై బీజేపీ రాద్దాంతం మొద‌లుపెట్టింది.
*విశాల‌మైన 56 అంగుళాల ఛాతీ ఉంద‌ని చెప్పుకున్న మ‌న చౌకీదారు.. త‌న‌ను కాపాడే బాధ్య‌త‌ను ఒక మ‌హిళ‌కు వ‌దిలేశారు. నిర్మ‌లా సీతారామ‌న్ జీ.. న‌న్ను నేను ర‌క్షించుకోలేని స్థితిలో ఉన్నాను.. మీరే న‌న్ను కాపాడాలంటూ ఆమెను ముందుకు నెట్టి.. చ‌ర్చ నుంచి పారిపోయారు* అన్నారు. ఇందులో మోడీకి బూతు క‌నిపించింది. మ‌హిళా క‌మిష‌న్‌కు త‌ప్పు కనిపించింది. అది ఎలానో ఎంత త‌ల బ‌ద్ద‌లుకొట్టుకున్నా అర్థం కావ‌డం లేదు.
వాస్త‌వానికి అది నిర్మ‌ల శ‌క్తిని మ‌రింత ఎక్కువ చేసే వ్యాఖ్యే కాని అందులో అగౌర‌వం ఏం లేదు. మోడీ లాంటోడు రియాక్ట్ కాని అంశం మీద నిర్మ‌లా డీల్ చేయ‌టంపై రాహుల్ మాట్లాడుతున్నాడంటే అది గ‌ర్వించ‌ద‌గిందే. దీన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్యగా సృష్టిద్దామ‌ని బీజేపీ ట్రై చేస్తే రాహుల్ గ‌ట్టిగా తిప్పికొట్టాడు. నేను అన్న‌మాట‌కు క‌ట్టుబ‌డి ఉన్నాను. మోడీ నా ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాల్సిందే అని గ‌ట్టిగా నిల‌బ‌డ్డారు రాహుల్‌. ఆయ‌న‌కు మ‌రింత మ‌ద్ద‌తు ల‌భించింది.
ఈరోజు ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో రాహుల్ గాంధీని ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కలిశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాహుల్ మాట‌ల్లో తప్పులేద‌న్నారు. `రాహుల్ వ్యాఖ్యలను మ‌హిళ కోణంలో కాకుండా వాస్త‌వ‌ కోణంలో చూడలేరా? పార్లమెంట్ లో చర్చ జరిగిన సమయంలో రాఫెల్ డీల్ అంశంపై ఓ ప్ర‌శ్న‌కు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వలేదనేది నిజం కాదా? అని ప్ర‌కాష్ రాజ్ ప్ర‌శ్నించారు. మొత్తానికి మోడీకి గ‌ట్టి మ‌ద్ద‌తే దొరికిన‌ట్లు చెప్పాలి.ఇక ప్ర‌కాష్ రాజ్ సంగ‌తి తెలిసిందే. జ‌స్ట్ ఆస్కింగ్ హ్యాష్టాగ్‌తో మోడీకి కొన్నాళ్లుగా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు. రాబోవు ఎన్నిక‌ల్లో బెంగుళూరు సెంట్ర‌ల్ ఎంపీ సీటుకు పోటీ చేస్తున్న విష‌యం కూడా తెలిసిందే. ఈరోజే ఆయ‌న ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌ను కూడా క‌లిశారు. ప్ర‌కాష్ రాజ్ వంటి వారి ఈ రాజ‌కీయాల‌కు చాలా అవ‌స‌రం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.