రాజకీయాలంటే ఇష్టం లేదంటూనే వస్తానంటున్న ప్రకాష్ రాజ్

         అప్పుడప్పుడు వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నాడు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్. నటనలో అతను అద్భుతం. కానీ మాటల్లో ఇందుకు విరుద్దంగా ఉంటాయి. ఒక్కోసారి ఒక్కో తరహాలో మాట్లాడుతుంటాడు ఆయన. తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని గతంలో ప్రకటించాడు.  కానీ పదేపదే సవాల్‌ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమేనని చెప్పాడు. మనసులో ఏముందో చెప్పలేకపోతున్నాడు. కానీ బయటకు మాత్రం రాజకీయాలు వద్దని ప్రస్తావిస్తున్నాడు. తమిళనాడులో రజనీకాంత్, కమల్ హాసన్, విశాల్, విజయ్ కాంత్ లు రాజకీయాల పై ఆసక్తి చూపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ అదే బాటలో నడిచే వీలుంది. కాకపోతే అతని ఆరంగేట్రం కర్నాటక ఎన్నికల్లో జరగనుంది. రాజకీయాలు కష్టం. అందులో ఒక బాధ్యత ఉంటుంది. అందుకే నేను దూరంగా ఉంటాను. పదేపదే సవాల్‌ చేస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమని చెప్పాడు. 
         జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ హత్య కేసులో బీజేపీ ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా మారాడు. జర్నలిస్టు హత్యను రాజకీయాలకు అతీతంగా అంతా ఖండించారు. పనిగట్టుకుని హేతువాదులను హతమార్చే పని చేయడం విమర్శలకు తావిచ్చింది. అదే సమయంలో సినిమాలకు సైన్ చేసే విషయంలోను ప్రకాష్ రాజ్ ఇబ్బంది పెడుతుంటాడు. ఒక దశలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు సినీ పరిశ్రమ సిద్దమైన సంగతి తెలిసిందే. తెలుగులోను ఆయన అడుగుపెట్టకుండా పలువురు నిర్మాతలు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. ఆతర్వాత రాజీకొచ్చాడు ప్రకాష్ రాజ్.  
         సమాజంలో జరుగుతున్న దారుణాలపై గళమెత్తాలని ప్రకాష్ రాజ్ నిర్ణయించుకున్నాడట. జర్నలిస్టుల మార్గదర్శకత్వంలో పెరిగిన ఏకలవ్య శిష్యుడను తాను అని చెప్పారు ప్రకాష్ రాజ్. భవిష్యత్ లో ఏం చేస్తాడో చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.