క‌నుమ‌రుగైన ప్ర‌జారాజ్యంతో జ‌న‌సేన‌ను పోల్చిచూస్తే?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అన్నిస్థానాల్ల‌నూ పోటీ చేసేందుకు సిద్ధ‌మౌతున్నామ‌న్న జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంలో ప్ర‌జారాజ్యంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. అందుకే అప్ప‌ట్లో ప్ర‌జారాజ్యం ముందు నేత‌లు క్యూక‌ట్టిన‌ట్లు, ఇప్పుడు కూడా త‌న ద‌గ్గ‌రికి నేత‌లు  వ‌స్తార‌నుకుంటున్నార‌నే టాక్ వినిపిస్తోంది.  ప్ర‌జారాజ్యం పార్టీని చిరంజీవి స్థాపించినప్ప‌డు ప్ర‌ముఖ నేత‌లు క్యూ క‌ట్టారు. కోట‌గిరి విద్యాధ‌ర‌రావు, దేవెంద్ర గౌడ్, భూమా నాగిరెడ్డి వంటి కీల‌క నేత‌లు త‌మ‌కుతాముగా వ‌చ్చి చిరంజీవికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. మ‌రోవైపు ఇత‌ర రంగాలకు చెందిన‌వారుకూడా ప్ర‌జారాజ్యంలో చేరారు. అయితే జ‌న‌సేన విష‌యానికి వ‌చ్చేస‌రికి ఆ త‌ర‌హా తీరు క‌నిపించ‌డంలేద‌నేది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప‌వ‌న్  స‌మావేశాలు నిర్వ‌హించిన‌పుడో, లేదా చ‌ర్చా వేదిక‌లు ఏర్పాటు చేసిన‌ప్పుడో మాత్ర‌మే  ప్ర‌ముఖులు వ‌స్తున్నారు.  అయితే పార్టీలో చేరేందుకు ప‌వ‌న్ కొంద‌రిని ఆహ్వానిస్తున్న‌ప్ప‌టికీ, వారి నుంచి ఆశించినంత‌ స్పంద‌న రావ‌డంలేద‌న్న‌వార్త వినిపిస్తోంది. తాజాగా, సీనియర్ నేత దాడి వీరభ‌ద్ర‌రావును పార్టీలోకి ప‌వ‌న్ ఆహ్వానించారు.
అయితే ఆయ‌న ఏం చెప్పార‌న్న‌ది ఇంకా తేల‌లేదు. మాజీ మంత్రి వ‌ట్టి వ‌సంత్ కుమార్ సైతం ఈ మ‌ధ్య ప‌వ‌న్ ను క‌లిశారు. అయితే ఆ చ‌ర్చ‌లు ఫ‌ల‌వంతం అయ్యాయో లేదో తెలియ‌లేదు. మ‌రోవైపు ప‌వ‌న్ ‘రాజ‌కీయాల్లోకి కొత్త‌ర‌క్తం రావాలి. కొత్త‌వాళ్లు రావాల‌ని వ్యాఖ్యానించారు.  ఏదిఏమైన‌ప్ప‌టికీ  ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. క‌నీసం కొన్ని స్థానాల్లోనైనా ప్ర‌ముఖుల‌ను నిల‌బెట్టాల్సి ఉంటుంద‌ని ప‌లువు అంటున్నారు. కాగా ప‌వ‌న్ కు ఈ మ‌ధ్య అంత్యంత స‌న్నిహితంగా క‌నిపించిన‌ వారిలో ఉండ‌వ‌ల్లి  ఒక‌రు. పార్టీలో చేరిక విష‌య‌మై  వారిద్ద‌రి మ‌ద్య‌ చ‌ర్చ‌కు వ‌చ్చింద‌నే వార్తలొచ్చాయి. కానీ ప‌ర్యావ‌స‌నాలు బ‌య‌ట‌కు రాలేదు. మ‌రోవైపు టీడీపీ నుంచి చాలామంది జ‌న‌సేన‌లోకి వ‌స్తారంటూ ఆ మ‌ధ్య ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. అదీ కేవ‌లం  ప్ర‌క‌ట‌న‌గానే మిగిలిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం మాజీ ప్ర‌జారాజ్యం నేత‌లు మిన‌హా పేరున్న‌వారెవ‌రూ జ‌న‌సేన‌వైపు వ‌స్తున్న వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌ధ్యంలో ప‌వ‌న్ వారితో జ‌రిపిన చ‌ర్చ‌లు విఫ‌ల‌మౌతున్నాయో, లేక ఆ నేత‌లు ఏమీ తేల్చ‌డంలేదో వెల్ల‌డికావ‌డం  లేదు. అయితే ఏ విష‌యాన్న‌యినా కాలమే తేల్చాలి మ‌రి!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.