మోడీకి మట్టి కుండలు పంపిన ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ సర్కార్ అన్యాయం చేస్తున్న సంగతి తెలిసిందే. హోదా అడిగితే ఇవ్వడం లేదు. ప్రజలు, పార్టీలు, వివిధ సంఘాలు, మేధావులు కేంద్రం తీరును నిరసిస్తున్నారు. ఇందుకు రకరకాల పద్దతులను వారు ఎంచుకుంటున్నారు. వారంతా ఒక దారి అయితే నాదారి ప్రత్యేకంగా ఉంటోంది అంటున్నారు ఆ నేత. అదేనండి మన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. అమరావతి రాజధాని నిర్మాణ శంఖుస్థాపనకు విచ్చేసిన ప్రధాని మోడీ ఢిల్లీలోని గుప్పెడు ఎర్రమట్టి, చెంబుడు నీళ్లు తీసుకువచ్చి ఇచ్చారు. అది మినహా మనకు ఏం ఇవ్వలేదనే ప్రచారం ప్రజల్లో బలంగా పాతుకుపోయింది.  
అందుకే ఎమ్మెల్యే రామానాయుడు, రైతులు మట్టి కుండలతో నిరసన పదర్శన చేశారు. ‘మోడీగారు మీ మట్టి.. మీ నీరు మాకొద్దు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కావాలి’ అనే నినాదించారు. ఏలూరులోని గాంధీబొమ్మ నుంచి పోస్టాఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడకు తీసుకువచ్చిన మట్టి కుండలను మోడీకి రామానాయుడు పార్సిల్ చేశారు. ఏపీకి పత్యేక హోదా ఇస్తామన్న మోడీ.. నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని రామానాయుడు నిప్పులు చెరిగారు. మన మట్టి కుండలు చూసి అయినా మోడీ కళ్లు తెరుస్తారనే అశాభావం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.