ఆమరణ దీక్ష చేస్తా.. వస్తారా…

సినిమాల వాళ్లను కదిలించిన యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రశాంతంగా ఉన్నారు. అసలు సినిమా వాళ్లు స్పందించరా అంటూ అక్కసు వెళ్లగక్కారు. వీలుంటే సినిమాలను బంద్ చేస్తామని చేసిన హెచ్చరిక బాగా పని చేస్తోంది. ఎంతగా వారు కౌంటర్ ఇస్తున్నారంటే.. తిరిగి టీడీపీ మీదకే వారు బాణాలు ఎక్కు పెడుతున్నారు. కొరివితో తలగోక్కోవడమంటే ఇదేనేమో! నంది అవార్డులు రానందుకు రచ్చకెక్కినవాళ్ళు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం బైటికి రారా అని అడిగారు టీడీపీ నేత. ఇందుకు ధీటుగానే స్పందిస్తున్నారు సినీ నటులు. ”మావాళ్ల భార్యలు రోజుకొకరితో పడుకుంటారని ఒక పెద్దమనిషి మాట్లాడారు. మీ రాజకీయ పార్టీలన్నీ కనీసం స్పందించలేకపోయాయి.. ఇప్పుడు నోళ్లు బాగా లేస్తున్నాయి..” అంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అంతెత్తున లేశారు. ప్రముఖ రచయిత పోసాని కృష్ణ మురళీ అంతే స్థాయిలో ధ్వజమెత్తారు. 
ఏపీకి ప్రత్యేక హోదా కోసం విజయవాడ నడిరోడ్డుమీద ఆమరణ దీక్ష చేస్తా.. మీరూ వస్తారా?” అని తెలుగుదేశం పార్టీ నేతల్ని సవాల్ చేశారు పోసాని. నేను ప్రాణాలు వదలడానికి సిద్దం. మీలో ఎవరికైనా ఆ తెగింపు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా మీద మాటలు మార్చే టీడీపీకి మాట్లాడే హక్కు ఉందా అంటున్నారు పోసాని. టాలీవుడ్ తరఫున ఆమరణ దీక్షకు సిద్ధపడ్డానన్న పోసాని మాటలతో సిని నటుల్లో ఒకటే చర్చ సాగుతోంది. నేను ఆమరణ దీక్ష చేస్తానని ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రకటించారు. నేను సైతం అంటూ క్రిటిక్ కత్తి మహేష్ ట్వీట్ చేశారు. మొదటి నుంచి హోదా కోసం మాట్లాడే హీరో శివాజీ అయితే ప్రాణత్యాగం కోసం నేను రెడీ అంటున్నారు. వారే కాదు.. హోదా ఇవ్వాల్సిందేనని బాలయ్య, మురళీ మోహన్, శివ ప్రసాద్, కవిత వంటి సినీ, రాజకీయ నేతలు ఎప్పటి నుంచో అడుగుతున్న సంగతి తెలిసిందే. ముందు ముందు యలమంచిలి కామెంట్లపై నిప్పులు చెరిగే వారు పెరిగే వీలుందని తెలుస్తోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.