అధికారం కోసం ఆసక్తికర ప్రయత్నాలు?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలసి 2014లో ఎన్నికల్లో తమ సత్తా చూపించాయి. 2019 ఎన్నికలకు ఈ మూడు పార్టీల దారులు వేరయ్యాయి. తెలుగు దేశం, వైసీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన బరిలో వుండే అవకాశం కనిపిస్తోంది. చంద్ర బాబు… నరేంద్ర మోదీలకు చెడిన తరువాత బాబు కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో జగన్ మోదీకి చేరువయ్యారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఇప్పటికే దీనిపై బాబు పరోక్షంగా చెప్పారు. ఇక జగన్ మోదీతో స్నేహం చేస్తున్నా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం కనిపించడం లేదంటున్నారు. బీజేపీ తో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తే మైనార్టీల ఓట్లు పోతాయని జగన్ పార్టీలో ఆందోళన నెలకొందని సమాచారం . ప్రజా సంకల్ప యాత్రతో జగన్ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారనే మాట వినిపిస్తోంది. దీంతో గతంలో కంటే ఇప్పుడు వైసీపీ ఓటు బ్యాంకు పెరిగిందని అంటున్నారు.
ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీ మాట ఇచ్చి మోసం చేసిందని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేసిందని చంద్ర బాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు . కేంద్రం సహకారం లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని జనాన్ని నమ్మించడంలో చంద్రబాబు సఫలం అవున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాబు ఓటు బ్యాంకు పెంచుకోవడానికి కేంద్రంపై బురద చల్లుతూనే ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తో పవన్ కళ్యాణ్ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చెయ్యవచ్చనేది వైసీపీలోని కొందరు బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది. ఇలాంటివారిలో సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఒకరు. ఆదిశేషగిరావు వైసీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. జగన్ కూడా ఆదిశేషగిరి రావుకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని భోగట్టా . ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలో తీసుకు రావాలని ఆదిశేషగిరావు ఆరాటపడుతున్నారట. దీంతో ఆయన పవన్ కళ్యాణ్ ను కలసి పొత్తులకు ఒప్పించే ప్రయత్నం చేశాడని , అయితే పవన్ కళ్యాణ్ జగన్ తో కలసి వెళ్ళడానికి సుముఖంగా లేరనే వార్తలు వినిపిస్తున్నాయి.  అలాగే వచ్చే ఎన్నికల్లో తెనాలి నుంచి శాసన సభకు ఆదిశేషగిరావు పోటీచేయబోతున్నారని తెలుస్తోంది. మరి ముందుముందు రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో వేచిచూడాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.