వాళ్లకు ఎన్టీఆర్‌, యాత్ర‌, ఉద్య‌మ సింహం…మ‌రి పవన్‌కు?

అల‌నాటి అందాల‌న‌టి సావిత్రి జీవితం ఆధారంగా వ‌చ్చిన మ‌హాన‌టి సినిమా ఎంత‌టి  ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే! ఈ నేప‌ధ్యంలో మ‌రిన్ని బ‌యోపిక్ ల‌కు ప్ర‌క‌ట‌న‌లు వ‌చ్చాయి. కార్య‌రూపం దాలుస్తున్నాయి. ఎన్టీఆర్ బ‌యోపిక్ ద్వారా ఎన్నిక‌ల్లో ల‌బ్ధిపొందాల‌ని టీడీపీ చూస్తుండ‌గా, వైఎస్ఆర్‌సీపీ… యాత్ర సినిమాతో అధికారం చేజిక్కించుకోవాల‌నుకుంటోంది. ఇక తెలంగాణాలో  మ‌రోసారి ఉద్య‌మ స్ఫూర్తిని చూపించాల‌నే ఉద్దేశంతో ఉద్య‌మ సింహం సినిమాకు స‌న్నాహాలు చేస్తున్నారు. టీడీపీకి ప్రాణం పోసిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఎన్టీఆర్ సినిమా నిర్మిత‌మ‌వుతోంది.  పాద‌యాత్ర‌ల‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవిత గాథ ఆధారంగా యాత్ర రూపొందుతోంది. అలాగే తెలంగాణ ఉద్య‌మాన్ని జాతీయ స్థాయికి తీసుకు వెళ్లిన కేసీఆర్ జీవితం ఆధారంగా ఉద్య‌మ సింహం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మ సినిమాలు ప్ర‌జ‌ల్లోకి దూసుకు వెళ్లేందుకు ఆయా పార్టీలు త‌మ సినిమాల్లో ప్ర‌ముఖ న‌టుల‌నే ఎంపిక చేసుకున్నాయి. ఎన్టీఆర్ చిత్రంలో బాల‌య్య లీడ్ రోల్ పోషిస్తుండ‌గా, యాత్ర‌లో వైఎస్ ఆర్ పాత్ర‌ను మ‌మ్ముట్టి పోషిస్తున్నారు. అలాడే కేసీఆర్ చిత్రంలో కేసీఆర్ పాత్ర‌ను ప్ర‌ముఖ న‌టుడు నాజ‌ర్ పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయా సినిమాల్లో ప్ర‌ధాన పాత్ర‌లే కాకుండా కీల‌క ప్రాత్ర‌లోనూ జ‌నాక‌ర్ష‌ణ క‌లిగిన న‌టుల‌నే ఎంపిక చేస్తున్నారు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, టీఆర్ ఎస్ పార్టీలు ఎన్నిక‌ల‌కు ముందుగానే త‌మ సినిమాల‌ను విడుద‌ల చేసి, ప్ర‌క్ష‌కాద‌ర‌ణ‌తో పాటు వారి ఓట్ల‌ను కూడా పొందాల‌నే ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. బ‌యోపిక్ ల విష‌యంలో అన్ని పార్టీలు దుసుకుపోతున్నా, ప‌న‌న్ ఈ విష‌యంలో వెనుక‌బ‌డే ఉన్నారు.
చిత్ర‌రంగంలో ఎంతో పేరు సంపాదించిన ప‌వ‌న్ ఎన్నిక‌లకు ముందుగా మాంచి ప‌వ‌ర్ ఫుల్ సినిమాను ప్రేక్ష‌కుల‌కు అందిస్తే బాగుంటుంద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. మిగ‌తా బ‌యోపిక్ ల‌లో ప్ర‌ముఖ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న త‌ర‌హాలోనే, ప‌వ‌న్ చిత్రంలో క్రికెట్ టీమ్‌న‌కు మించిపోయి  ఉన్న మోగా హీరోలు క‌లిసి న‌టిస్తే బాగుంటుంద‌ని ప‌లువురు సూచిస్తున్నారు. అప్పుడే మిగిలిన పార్టీల‌ల‌కు దీటుగా ప‌వ‌న్ స‌మాధానం చెప్పిన‌ట్లువుతుంద‌ని అభిమానులు అంటున్నారు. కాగా మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం షూటింగ్ జూలై 5న ప్రారంభమైంది.  అభిమానులను ఉద్దేశించి ఎన్టీఆర్ స్వయంగా 1975లో ఒక ఉత్తరం రాశారు. “అభిమానమును మించిన ధనము, ఆదరమును మించిన పెన్నిధి, ఈ లోకమున లేదు. ఇందరి సోదరుల ప్రేమానురాగములను పంచుకోగలుగుట ఈ జన్మకు నేను పొందిన వరం. మీకు సదా ఋణపడ్డట్టే. నా శుభాకాంక్షలు, సోదరుడు రామారావు” అని ఎన్టీఆర్ రాసిన ఉత్తరాన్ని థీమ్ గా చేసుకుని ఈ సినిమాను ప్రారంభించారు. ఇక వైస్ రాజ‌శేఖ‌రెడ్డి  జీవితగాథ ఆధారంగా రూపొందుతున్న‌ యాత్ర సినిమాను ‘‘తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ గడప దాటి ప్రతీ గడపలోకి వెళ్లాలని ఉంది.. వారితో కలిసి నడవాలని ఉంది.. వారి గుండె చప్పుడు వినాలని ఉంది. గెలిస్తే పట్టుదల అంటారు.. ఓడితే మూర్ఖత్వం అంటారు. పాదయాత్ర మూర్ఖత్వమో లేక పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది’’ అనే ప‌వ‌ర్‌ఫుల్ వ్యాఖ్యానంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. కేసీఆర్‌ పాత్రని ప్రముఖ నటుడు నాజర్‌ పోషిస్తున్నారు. న‌వంరు 9 ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌రు. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఈ బ‌యోపిక్ ల‌కు మించిన ప‌వ‌ర్‌పుల్ సినిమాతోవ‌స్తే జ‌న‌సేన‌కు మేలు జ‌రుగుతుంద‌ని ప‌లువురు అంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.